Meghalaya Violence: ప్రభుత్వ వాహనాలపై దాడులు.. రాజీనామా చేసిన మేఘాలయ హోం మంత్రి.. సీఎం ఇంటిపై పెట్రోల్ బాంబులు..

షిల్లాంగ్ పట్టణంలో హింసాత్మక ఘటనలు

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(HNLC) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం.. హింసాత్మక ఘటనలకు దారితీసింది.

  • Share this:
    ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(HNLC) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం.. హింసాత్మక ఘటనలకు దారితీసింది. అతడి మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయి. ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అసోం నుంచి షిల్లాంగ్‌కు వచ్చిన ఓ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.ఈ క్రమంలోనే మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. ఇది ఈ కేసు విచారణ పారదర్శక సాగడానికి ప్రభుత్వ తీసుకన్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు.

    లైతుంఖ్రా వద్ద పేలుడుకు సంబంధించి థాంగ్‌కీ పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. అక్కడ మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావించారు. అయితే అతడు పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. దీంతో ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడని పోలీసు అధికారులు చెప్పారు. ఇక, ఈ ఘటనపై థాంగ్‌కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    థాంగ్‌కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు.  ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్‌నెట్‌ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు.

    ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. థాంగ్‌కీ మరణంపై విచారణకు ఆదేశించినున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల స్పందించింది. సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.

    సీఎం ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరిన ఆందోళకారులు..
    మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: