హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers protest: రైతుల నిర‌స‌న‌పై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Farmers protest: రైతుల నిర‌స‌న‌పై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స‌త్య‌పాల్ మాలిక్‌

స‌త్య‌పాల్ మాలిక్‌

Farmers protest: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌పై రైతులు దాదాపు ఏడాదిగా నిర‌స‌న చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల నిర‌స‌న‌పై మేఘాలయ (Meghalaya) గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌పై రైతులు దాదాపు ఏడాదిగా నిర‌స‌న చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల నిర‌స‌న‌పై మేఘాలయ (Meghalaya) గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయన జైపూర్‌ (Jaipur)లో ఓ కార్య క్రమం లో ప్రసం గిస్తూ.. తాను రైతు నిరసనలపై మాట్లాడినప్పు డల్లా అది వివాదాస్ప దమవుతోం దని, దీం తో ఢిల్లీ (Delhi) నుం చి ఫోన్ వస్తుం దేమో ఆలోచిం చాల్సి వస్తోందని అన్నారు. ‘ఢిల్లీ నేతలు.. ఒక జం తువు చనిపోయినప్పు డు కూడా సంతాపం వ్య క్తం చేస్తారు. కానీ, కొన్నా ళ్లుగా సాగుతున్న నిరసనల్లో దాదాపు 600 మం ది రైతులు మరణిం చినా.. లోక్‌స‌భ (Lok Sabha)లో కనీసం వారి ప్రస్తావన తీసుకురాలేదు’ అని కేంద్ర ప్రభుత్వ నేతలపై పరోక్షంగా విమర్శించారు. ‘వారు కోరితే.. పదవి వదిలేస్తా’

  సాధార‌ణంగా గ‌వ‌ర్న‌ర్‌ (Governer)ని తొల‌గించ‌లేర‌ని ఆయ‌న అన్నారు. అయితే తాను చేసే వ్యాఖ్య‌ల కార‌ణంగా అవి వివాదాస్ప‌దం అవుతున్నాయ‌ని అన్నారు. త‌న వ్యాఖ్య‌లు ఢిల్లీ పెద్ద‌ల ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని అన్నారు.

  Zycov-D : పిల్లల టీకా వ‌చ్చేస్తోంది.. కోటి డోసుల‌కు కేంద్రం ఆర్డ‌ర్


  ఈ వ్యాఖ్య‌ల కార‌ణంగా త‌న‌ను ప‌దవి వ‌దులుకోవాల‌ని వారు కోరితే ఒక్క నిముషం కూడా ఆల‌స్యం చేయ‌కుండా ప‌ద‌విని వ‌దులుకుంటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. రైతుల డిమాండ్ల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని అన్నారు.

  సాగు చ‌ట్టాల‌పై రైతులు చెప్పిన డిమాండ్ల‌ను నిర‌వేర్చ‌క‌పోతే బీజేపీ (BJP) తిరిగి అధికారంలోకి రాలేద‌ని ఆయ‌న గ‌తంలో పేర్కొన్నారు.

  ఇప్ప‌టికే వ్యవసాయ చట్టాలకు వ్య తిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఎంపీ రామ్ చందర్ జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలేని తాగుబోతులే వ్య వసాయ ఆందోళ‌న చేస్తున్నార‌ని అన్నారు. దీంతో ఆంగ్ర‌హం ్య‌క్తం చేసిన రూతులు హిసార్ జిల్లాల న‌ర్నౌంద్‌లో ఆయ‌న కారును అడ్గ‌గించారు. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు కారు వాహ‌నాన్ని ధ్వ‌సం చేశారు. రైతులే దాడికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆర‌పిస్తున్నారు. కానీ రైతు సంఘం నాయ‌కులు మాత్రం తాము కాద‌ని వాదిస్తున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bjp, Farmers, Farmers Protest, India, Meghalaya

  ఉత్తమ కథలు