హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమంపై తొలిసారి స్పందించిన మెగాస్టార్ : కారణం అదేనా?

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమంపై తొలిసారి స్పందించిన మెగాస్టార్ : కారణం అదేనా?

ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే దీనిపై స్పందించి ఏపీ కాంగ్రెస్.. చిరంజీవి కాంగ్రెస్‌వాదే అని వివరణ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే దీనిపై స్పందించి ఏపీ కాంగ్రెస్.. చిరంజీవి కాంగ్రెస్‌వాదే అని వివరణ ఇచ్చింది.

విశాఖ ఉక్కు ఉద్యమంపై మెగస్టార్ చిరంజీవి తొలిసారి నోరు విప్పారు. ఆ రోజుల్లో ఉద్యమం కోసం తాను ఏం చేశాను కూడా చెప్పారు. కాలేజీ రోజుల్లో జరిగిన ఘటనలను గుర్తుకు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలని చిరంజీవి కోరారు.

ఇంకా చదవండి ...

  విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. కార్మికసంఘాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభలో కేంద్రం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం తరువాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది. దీంతో సోమవారం నుంచి ఉక్కు ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ ఉద్యమానికి టాలీవుడ్ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంపై తీవ్ర వీమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ పెద్దలు ముందుకు వచ్చి విశాఖపై స్పదించాలి అనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

  ఇంతకాలం నారా రోహిత్ ఒక్కడే విశాఖ ఉక్కుపై నేరుగా గళం విప్పాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.

  తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి తన మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ బావోద్వేగ పూరిత సందేశం పోస్ట్ చేశారు.  విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు  అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి అన్నారు. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఘటన ఇంకా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అన్నారు.  ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామన్నారు.  అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించామన్నారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం అన్నారు.

  విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌ గనులు కేటాయించకపోవడం, నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదని మెగాస్టార్ అన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను అన్నారు. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి అన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యమని పిలుపు ఇఛ్చారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం  అని చిరంజీవి పిలుపునిచ్చారు.

  విశాఖ ఉక్కుపై చిరంజీవి ట్వీట్

  చాలా రోజుల నుంచి విశాఖ ఉక్కు మన హక్కు అంటూ ఆందోళనలు మిన్నంటుతున్నా టాలీవుడ్ నేతలు ఒక్కరు కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు నేరుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు విశాఖ ఉద్యమంపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. అవసరమైతే విశాఖ వెళ్లి మరి  ఆందోళనల్లో పాల్గొంటాను అని హామీ ఇచ్చారు.

  ఇదీ చదవిండి: విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టిన కేటీఆర్: కానీ ఓ కండిషన్ పెట్టిన మంత్రి?

  తెలంగాణ మంత్రే స్పందించినప్పుడు.. ఏపీకి చెందిన తాను స్పందించకపోతే విమర్శలు వెల్లువెత్తుతాయని చిరంజీవి భావించారా? లేదా తమ్ముడు పవన్.. బీజేపీతో పొత్తు కారణంగా దీనిపై నేరుగా ప్రశ్నించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి స్పందిస్తే పవన్ పై ఒత్తిడి తగ్గుతుందని.. అందుకే చిరంజీవి అకస్మాత్తుగా స్టీల్ ప్లాంట్ పై స్పందించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: KTR, Mega Family, Megastar, Megastar Chiranjeevi, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

  ఉత్తమ కథలు