సాధారణంగా సరైన వయసు వచ్చేంతవరకు ఎవరూ కూడా ఎక్కువ విషయాలను గుర్తుంచుకోలేరు. కానీ పశ్చిమ బెంగాల్ (West Bengal)కి చెందిన చిన్నారి(2 సంవత్సరాల 9 నెలలు) మాత్రం తన అద్భుతమైన జ్ఞాపకశక్తి (Memory)తో అన్నీ గుర్తుపెట్టుకుంటోంది. ఈ చిన్నారి గతేడాది నవంబర్‌లో A నుంచి Z వరకు ప్రతి అక్షరానికి ఒక మోటార్‌సైకిల్, ఒక కారు కంపెనీ పేరును రెండు నిమిషాల్లోనే చెప్పేసి 'నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో తన పేరును నమోదు చేసుకుంది. నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఆమె చెంతకు ఈ కొత్త సంవత్సరంలో చేరింది. ఎక్సలెంట్ మెమొరీ పవర్ గల ఈ చిన్నారి పేరు అధిష్ఠాత్రి బిస్వాస్ (Adhisthatri Biswas). ఈమె హూగ్లీ జిల్లా, చిన్సురాలోని దత్తా బగన్లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
* బడిలో కాలు పెట్టకనే.. రికార్డుల పంట..
అధిష్ఠాత్రి తన అసాధారణమైన మెమొరీ పవర్‌తో ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. తన కూతురికి ఉన్న అద్భుతమైన జ్ఞాపకశక్తికి, ఆమెను వరిస్తున్న విజయాలకు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు హోల్డర్ వయస్సు కేవలం రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే!
మరో విశేషమేమిటంటే, ఆమె ఇంకా బడిలో కూడా కాలు పెట్టలేదు. అయినా కూడా కష్టమైన ఇంగ్లీష్ వర్డ్స్ అందరికీ అర్థమయ్యేలా చక్కగా చెబుతూ వావ్ అనిపిస్తోందీ ఈ చిన్నారి. అలానే వరుసగా రికార్డ్స్ సృష్టిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాపాయి తండ్రి పేరు అభిజిత్ బిస్వాస్ కాగా అతను ఒక ప్రొఫెసర్. ఆమె తల్లి హోమ్ ట్యూటర్.
* నిమిషంలో 100 ప్రశ్నలకు సమాధానాలు
మొదటగా అధిష్ఠాత్రి తన తల్లి ఆడించే వివిధ గేమ్స్ ద్వారా జంతువులు, మొక్కల శాస్త్రీయ నామాలతో పాటు వివిధ కారు కంపెనీల పేర్లను నేర్చుకోవడం ప్రారంభించింది. అలానే ఈ ప్రతిభ గల బాలిక కేవలం ఒకే ఒక నిమిషంలో 100 వరకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలను చెప్పగలదు.
విషయాలను గుర్తించుకోవడం పైనే కాదు సంగీతం పట్ల కూడా అధిష్ఠాత్రికి ఆసక్తి ఉంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలనేది తమ ఏకైక కల అని తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఇంతకు ముందు రెండేళ్ల వయసులో ఈ చిన్నారి భారత ప్రపంచ రికార్డులో తన పేరు నమోదు చేసుకుంది.
* ఆడిస్తూనే కొత్త విషయాలు నేర్పుతాం
రోజంతా ఆడిస్తూనే తన కూతురికి ఎన్నో విషయాలను నేర్పిస్తున్నామని తల్లి రాజ్‌కుమారి బిస్వాస్ న్యూస్ మీడియాకి తెలిపారు. తాము వివిధ విషయాల గురించి మాట్లాడుతుంటే తన కూతురికి జ్ఞాపక శక్తి పెరిగిందని ఆమె వెల్లడించారు. తన కుమార్తెకు వర్డ్స్ అంటే అమితమైన ప్రేమ అని, అందుకే చిన్నతనం నుంచే వర్డ్స్ పలుకుతూ చాలా సబ్జెక్టులలో ప్రావీణ్యం సంపాదించిందని ఆమె చెప్పుకొచ్చారు.
తన చిన్నారి అసాధారణమైన ప్రతిభతో తక్కువ సమయంలోనే పలికే కష్టమైన వర్డ్స్ అన్ని రికార్డు చేసి, ఆ వీడియోను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలకు పంపినట్లు ఆమె పేర్కొంది. అలా పంపిన వెంటనే తన చిన్నారికి వరుసగా అవార్డులు లభించాయని ఆమె ఎంతో సంతోషంగా చెప్పారు.
బై రైటర్ రహీ హాల్డర్ (న్యూస్18 లోకల్)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, West Bengal