Home /News /national /

MEET THE SWEEPER WHO ROSE TO BECOME AN ASSISTANT GENERAL MANAGER AT SBI UMG GH

Success Story: స్వీపర్ టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్.. ఈ మహిళ ఎందరికో ఆదర్శం.. ఈ ప్రస్థానం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

స్వీపర్ టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్.. ఈ మహిళ ఎందరికో ఆదర్శం.. ఈ ప్రస్థానం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

స్వీపర్ టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్.. ఈ మహిళ ఎందరికో ఆదర్శం.. ఈ ప్రస్థానం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

భర్త మరణం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో చిన్న ఉద్యోగం పొందిన ఓ మహిళ ఇప్పుడు ఆ బ్యాంక్‌లో ఉన్నతాధికారి అయ్యారు. 20 సంవత్సరాలకు ముంబై బ్రాంచ్‌లో చిన్న ఉద్యోగంలో చేరినప్పుడు, 37 సంవత్సరాల తర్వాత ఉన్నత ఉద్యోగాన్ని పొందుతానని ఆమె ఊహించి ఉండరు. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పూణేకు చెందిన ప్రతీక్ష టొండ్వాల్కర్.

ఇంకా చదవండి ...
భర్త మరణం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో చిన్న ఉద్యోగం పొందిన ఓ మహిళ ఇప్పుడు ఆ బ్యాంక్‌లో ఉన్నతాధికారి అయ్యారు. 20 సంవత్సరాలకు ముంబై బ్రాంచ్‌లో చిన్న ఉద్యోగంలో చేరినప్పుడు, 37 సంవత్సరాల తర్వాత ఉన్నత ఉద్యోగాన్ని పొందుతానని ఆమె ఊహించి ఉండరు. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పూణేకు చెందిన ప్రతీక్ష టొండ్వాల్కర్. ఆమె చిన్నప్పుడు పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేదు. కానీ అవసరం కోసం ఎస్‌బీఐలో స్వీపర్‌గా వృత్తిని ప్రారంభించారు. కుమారునికి మెరుగైన జీవితాన్ని అందించాలని ఆ తర్వాత కష్టపడి చదివారు, పనిచేశారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు.

టొండ్వాల్కర్ 1964లో పూణేలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. ఆమెకు 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే 16 సంవత్సరాలకు సదాశివ్ కడుతో పెళ్లి చేశారు. ఆయన ముంబైలో ఉంటూ, ఎస్‌బీఐలో బుక్ బైండర్‌గా పనిచేశారు. ఒక సంవత్సరం తరువాత వీరికి కొడుకు పుట్టాడు. ఆ సమయంలో దేవుడి మొక్కు తీర్చుకునేందుకు స్వగ్రామానికి వెళ్లాలని దంపతులు భావించారు. అయితే ఈ యాత్రలో జరిగిన ఓ ప్రమాదంలో కడు ప్రమాదానికి గురై చనిపోయారు. దీంతో 20 ఏళ్లకే టొండ్వాల్కర్ వితంతువుగా మారింది. ఆమె తన కోసం, తన కొడుకు కోసం పరిస్థితులతో పోరాడాలని నిర్ణయించుకుంది.

 ఇదీ చదవండి: నయా ట్రెండ్ సెట్ చేసిన ముస్లిం వధువు.. ఏం చేసిందో చదివితే అభినందిస్తారు !


ఆ సమయంలో భర్తకు రావాల్సిన బకాయిలను తీసుకోవడానికి ఎస్‌బీఐ బ్రాంచ్‌కి టొండ్వాల్కర్ వెళ్లారు. భర్త ఉద్యోగాన్ని పొందే అర్హత లేకపోవడంతో బ్యాంకును సాయం అడిగి.. బ్యాంకులో స్వీపర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరారు. ఉదయం రెండు గంటలపాటు బ్రాంచ్‌ ఆవరణ ఊడ్చి, వాష్‌రూమ్‌లు శుభ్రం చేస్తూ, ఫర్నీచర్‌ దుమ్ము తుడుస్తూ నెలకు రూ.60-65 సంపాదించారు. మిగిలిన సమయాన్ని ఇతర చిన్న ఉద్యోగాలకు, ముంబైలో జీవితాన్ని కొనసాగించడానికి, తన కొడుకును చూసుకోవడానికి కేటాయించారు.

అయితే బ్యాంకులో స్వీపర్‌గా పని చేయడం ప్రతీక్ష ఆకాంక్షలను పెంచింది. ఈక్రమంలోనే 10వ తరగతి పరీక్షలను పూర్తి చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. కొంతమంది బ్యాంకు అధికారుల సాయంతో ముండుగు వేసింది. బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు రంగంలోకి దిగి ఆమెకు స్టడీ మెటీరియల్‌ అందించారు. 10వ తరగతి పరీక్షల్లో 60 శాతం స్కోర్‌తో పాస్‌ అవ్వడానికి ఆమెకు సాయం చేశారు.* వెనక్కి తిరిగి చూడలేదు
ఆమె పరీక్షలు క్లియర్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడటానికి బ్యాంకింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని టొండ్వాల్కర్‌కు తెలుసు. బ్యాంకింగ్ పరీక్షలకు 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అందుకే దాచుకొన్న డబ్బులతో ముంబైలోని విక్రోలిలోని నైట్ కాలేజీలో చేరారు. సహోద్యోగుల సహాయంతో 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 1995లో నైట్ కాలేజీలోనే చదివి సైకాలజీ డిగ్రీ పూర్తిచేసి, బ్యాంకులో క్లర్క్‌గా పదోన్నతి సొంతం చేసుకున్నారు.

* కుటుంబం సపోర్ట్‌
1993లో ప్రమోద్ అనే వ్యక్తిని టొండ్వాల్కర్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త కూడా బ్యాంక్ ఉద్యోగి. ఆయన కూడా భార్యను బ్యాంకింగ్ పరీక్షలకు హాజరయ్యేలా ప్రోత్సహించారు. ఇలా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2004లో ఆమె ట్రైనీ ఆఫీసర్‌గా ఎదిగారు. జూన్‌లో AGMగా పదోన్నతి పొందే ముందు వివిధ ఆఫీసర్ గ్రేడ్‌లలో పని చేశారు.

* ఇంకా సాధించాలి
పదవీ విరమణ చేయడానికి ఇప్పుడు టొండ్వాల్కర్‌కు రెండేళ్ల సమయం ఉంది. ఎస్‌బీఐలో 37 సంవత్సరాల పనిలో ఆమె పట్టుదల, సంకల్పం ఫలించాయి. అయితే ఇది ఆమెకు ముగింపు కాలేదు. ప్రతీక్ష 2021లో నేచురోపతి కోర్సు పూర్తి చేశారు. పదవీ విరమణ తర్వాత ఆ జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేస్తూ, సేవ చేయాలని భావిస్తున్నారు. ‘వెనుదిరిగి చూస్తే నా ప్రయాణం అసాధ్యంలా కనిపిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నవారికి నా జీవితం స్ఫూర్తి కావాలి’ అని టొండ్వాల్కర్ చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: India news, Mumbai, Sbi, Success story

తదుపరి వార్తలు