హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ideal Farmer: బ్యాంకు జాబ్ వదిలేశాడు.. 100 పనస చెట్లతో రైతుగా మారి అద్భుతాలు చేస్తున్నాడు!

Ideal Farmer: బ్యాంకు జాబ్ వదిలేశాడు.. 100 పనస చెట్లతో రైతుగా మారి అద్భుతాలు చేస్తున్నాడు!

PC : Facebook

PC : Facebook

Ideal Farmer: ప్రస్తుతం వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. కూలీలు, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో చాలా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బంగారం లాంటి బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి.. రైతుగా మారి అద్భుతాలు చేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దృఢ సంకల్పం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించారు ఓ వ్యక్తి. మంచి జీతం వస్తున్న ఉద్యోగాన్ని (Job) వదిలేసి తనకు నచ్చిన వ్యవసాయంలోకి దిగారు. ఆరేళ్ల పాటు ఎంతో శ్రమించారు. రకరాల పంటలు సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తూ.. నలుగురి రైతుల (Farmers)కు ఆదర్శంగా నిలిచారు. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

* బ్యాంక్ ఉద్యోగం వదిలేసి..

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన కొచ్చుముట్టం సన్నీ బ్యాంక్ ఉద్యోగం చేస్తుండేవాడు. ఈ రోటిన్ ఉద్యోగం తనకు బోర్ కొట్టిందో లేక కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని అనుకున్నారేమో ఏమో తెలియదు కానీ, వ్యవసాయంలోకి దిగాడు. తనకున్న ఐదు ఎకరాల భూమిలో జాక్‌ఫ్రూట్(పనస) పంటను సాగు చేశాడు. ఆరేళ్ల పాటు వాటిని చాలా జాగ్రత్తగా పెంచారు. దాదాపు 100 పైగా పనస చెట్లు గతేడాది మంచి దిగుబడిని ఇచ్చాయి. దీంతో బ్యాంకు ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.

* అన్ని కాలాల్లో ఆదాయం ఉండేలా..

జాక్‌ఫ్రూట్ సాగుతో పాటు చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, మేకల పెంపకం చేపడుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు సన్నీ. అలాగే కోకో, అరటి, మిరియాలు, పసువు, అల్లం సాగు వంచి రకరకాల పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. అన్ని కాలాల్లో ఆదాయం ఉండేలా పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు.

కలబంద, అడవి పసుపు (కస్తూరి మంజల్), మరియు నల్ల పసుపు వంటి అరుదైన ఔషధ మొక్కలను కూడా సన్నీ పండించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో, అతను రబ్బరు తోటల కోసం స్థలాలను కూడా కనుగొన్నారు.

* ఉత్తమ బాల రైతుగా కొడుకు డేనియల్..

సన్నీకి భార్య థ్రెసియమ్మ, కొడుకు డేనియల్ ఉన్నారు. వీరి మద్దతుతో సన్నీ వ్యవసాయం రంగంలోకి దిగి లాభాల పంట పండిస్తున్నాడు. తన బలం తన కుటుంబమే అంటారు సన్నీ. కుటుంబ సభ్యుల సపోర్ట్‌తోనే వ్యవసాయం చేస్తున్నానని అతను చెప్పుకొచ్చాడు. కొడుకు డేనియల్ ముల్లారింగడ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నాడు. అతను ఇటీవల ఉత్తమ బాల రైతుగా ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి : వామ్మో.. ఈ పాలు లీటరుకి రూ.13 వేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?

వాణిజ్య పంటలతో పాటు కలబంద, అడవి పసుపు (కస్తూరి మంజల్,) నల్ల పసుపు వంటి అరుదైన ఔషధ మొక్కలను సాగు చేయడానికి సన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రబ్బరు తోటల సాగు కోసం ఇతర ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేశారు.

* నలుగురికి ఆదర్శం...

ప్రస్తుతం వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. కూలీలు, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో చాలా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బంగారం లాంటి బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబ అండతో వ్యవసాయంలోకి వచ్చి అద్భుతాలు చేస్తున్న సన్నీ.. నిజంగా అదర్శ రైతు అనడంలో సందేహం లేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Farmer, Kerala, National News, VIRAL NEWS

ఉత్తమ కథలు