హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Radio Uncle: పశ్చిమ్ బెంగాల్‌లో రేడియో అంకుల్.. నవరాత్రుల సమయంలో ఈయనో సెలబ్రిటీ!

Radio Uncle: పశ్చిమ్ బెంగాల్‌లో రేడియో అంకుల్.. నవరాత్రుల సమయంలో ఈయనో సెలబ్రిటీ!

Photo Credit : Facebook

Photo Credit : Facebook

Radio Uncle: రేడియో అంకుల్ షాప్ ఉత్తర కోల్‌కతాలోని కుమార్తులిలో ఉంది. ఆయన స్టోర్‌లో పాత రేడియోలు ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో ఆయన రేడియోలో ఉదయం ప్రసారాలు, సంగీతం వినేవాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మనకు టీవీలు పరిచయం కాకముందు ప్రజలు ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి రేడియో (Radio)లపై ఆధారపడేవారు. వార్తలు, విశేషాలతో పాటు పండుగల సందర్భంగా ప్రసారమయ్యే ప్రత్యేక కథనాల కోసం ప్రజలంతా ఒకే దగ్గర చేరి రేడియో వినేవారు. అంతటి ప్రాధాన్యం ఉన్న రేడియోలు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. పెద్ద టీవీ (TVs)లు, స్మార్ట్‌ ఫోన్లు (Smart phones), సోషల్ మీడియా రాకతో రేడియో ప్రోగ్రామ్స్‌కు ఆదారణ తగ్గింది. అయితే పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని ఒక వ్యక్తి మాత్రం నవరాత్రుల సందర్భంగా తీరిక లేకుండా రేడియోలతో కుస్తీ పడుతున్నాడు. నవరాత్రుల్లోని మహాలయ అమావాస్య రేడియోల్లో ప్రసారమయ్యే మహిషాశుర మర్దితి కథను వినేందుకు చాలామంది పాత రేడియోలను రిపేర్ చేయించేందుకు ఈయన వద్దకు బారులు తీరారు. దీంతో ఇక్కడి ‘రేడియో అంకుల్’ వాటిని బాగుచేస్తూ ప్రజలకు సాయం చేస్తున్నాడు.

నవరాత్రుల్లో బెంగాలీల ఇంట్లో ఒకరోజు రేడియో కచ్చితంగా వినిపిస్తుంది. మహాలయ నాడు తెల్లవారుజామున రేడియోలో మహిషాసురమూర్దిని వింటూ లేవడం వారి ఆచారం. అయితే రేడియోను ప్రజలు ఏడాది పొడవునా ఉపయోగించట్లేదు కాబట్టి అవి ఈ సమయానికి పనిచేయవు. దీంతో అక్కడి ప్రజలంతా ‘రేడియో కాకు’ లేదా రేడియో అంకుల్ వద్దకు వెళ్లి, వాటిని రిపేర్ చేయించుకున్నారు. అంతలా ఫేమస్ అయిన ఈ వ్యక్తి పేరు అమిత్ రంజన్ కర్మాకర్. 70లకు చేరువలో ఉన్న ఆయన ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారారు.

* స్టోర్ ఎక్కడ ఉంది?

రేడియో అంకుల్ షాప్ ఉత్తర కోల్‌కతాలోని కుమార్తులిలో ఉంది. ఆయన స్టోర్‌లో పాత రేడియోలు ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో ఆయన రేడియోలో ఉదయం ప్రసారాలు, సంగీతం వినేవాడు. అలా రేడియోపై ప్రేమ పెరిగింది. 17 సంవత్సరాల వయసు రేడియో మెకానిక్ పనిని ప్రారంభించాడు. ఆ సమయంలో రేడియో మెకానిక్‌ వర్క్‌కు చాలా డిమాండ్ ఉంది. 2000 వరకు ఆయన వ్యాపారం బాగానే కొనసాగింది. కానీ ఆ తర్వాత రేడియోలు కనుమరుగవడంతో కష్టాల్లో పడ్డాడు.

బిజినెస్ తగ్గడంతో ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ.. రేడియో అంకుల్ అమిత్ రంజన్ కర్మాకర్ మాత్రం ఈ వర్క్‌ను వదల్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియోలను రిపేర్ చేసే వృత్తిని ప్రేమిస్తూ, దీన్ని తనకు ఇష్టమైన వ్యాపకంగా మార్చుకున్నారు. అతి తప్ప వేరే వృత్తికి ఎప్పుడూ మారలేదు. కానీ ఇటీవలి కాలంలో అతడి పనికి డిమాండ్ బాగా పెరిగింది.

ఇది కూడా చదవండి : నవరాత్రుల సందర్భంగా రైల్వే ప్రయాణికులకు స్పెషల్ మెనూ.. ఫుడ్‌ ఇలా ఆర్డర్‌ చేసుకోండి..

అదృష్టం కలిసిరావడంతో ఇప్పుడు ఆయన ఒక సెలబ్రిటీగా మారారు. 2010లో అమిత్ గురించి తెలిసిన ఫోటోగ్రాఫర్లు, ఆయన గురించి వార్తా కథనాలు పంపించారు. దీంతో అప్పట్లోనే ఆయన గురించి చాలామందికి తెలిసింది. అమిత్ పని గురించి తెలిసి, చాలా మంది తమ రేడియోలను ఆయన వద్ద రిపేర్ చేయిస్తున్నారు. ఆయన కూడా శ్రద్ధగా వాటిని బాగుచేస్తున్నారు. దీంతో అతడి వ్యాపారం గతంలో మాదిరిగా కొనసాగుతోంది.

తన గురించి తెలుసుకొని ఫోటోలు తీసి ప్రాచుర్యం కల్పించిన వారికి ఇప్పుడు రేడియో అంకుల్ కృతజ్ఞతలు చెబుతున్నారు. వారి వల్లనే తన వ్యాపారం ఇంకా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్యకు ముందు పని చాలావరకు పెరిగిందని అమిత్ చెప్పారు. నవరాత్రుల్లో మహిషాశుర మర్దిని కథను రేడియోలో వినాలకుకునే వారికి ఈ రేడియో అంకుల్ సాయం చేశారు. ప్రస్తుతం రోజంతా పని చేస్తూ తన వృత్తికి దక్కిన గుర్తింపును చూసి సంతోషిస్తున్నారు.

(Rahee Halder)

Published by:Sridhar Reddy
First published:

Tags: Kolkata, Navaratri, VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు