‘దండయాత్ర’: 170 సార్లు పోటీ.. అన్నిసార్లూ ఓడి రికార్డు సృష్టించిన వీరుడు..

1988 నుంచి ఇప్పటి వరకు 170 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన హేమాహేమీల మీద కూడా పోటీ చేయడం విశేషం.

news18-telugu
Updated: April 2, 2019, 12:05 PM IST
‘దండయాత్ర’: 170 సార్లు పోటీ.. అన్నిసార్లూ ఓడి రికార్డు సృష్టించిన వీరుడు..
డాక్టర్ కె. పద్మరాజన్
  • Share this:
ఎన్నికల్లో పోటీ చేయడం అంటే పెద్ద పని. ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? ఒకవేళ ఓడిపోతే, ఆ ఎన్నికల ప్రచారం చేసిన ఖర్చు అంతా గంగలో పోసినట్టే. దీంతో పాటు ఓడిపోతే పరువు ఏమవుతుందని కూడా చాలా మంది భయపడతారు. ఇలాంటివన్నీ ఆలోచించి వార్డు మెంబర్‌గా పోటీ చేయడానికి కూడా వెనుకాడుతారు. అయితే, అతను మాత్రం ఇవేవీ ఆలోచించడు. పోటీ చేయడమే అతని పని. గెలవడం? ఓడిపోవడం అనేదాంతో అతనికి సంబంధం లేదు. ఆ కమిట్‌మెంట్‌తోనే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింట్లోనూ ఆయన పోటీ చేశాడు. చేస్తాడు. ఆయనే డాక్టర్ కె. పద్మరాజన్.

170 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన పద్మరాజన్


తమిళనాడులోని సేలం‌కి చెందిన పద్మరాజన్ వృత్తిరీత్యా హోమియో వైద్యుడు. ఆ తర్వాత వ్యాపారం మొదలు పెట్టాడు. 1988 నుంచి ఇప్పటి వరకు 170 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన హేమాహేమీల మీద కూడా పోటీ చేయడం విశేషం. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఏపీజే అబ్దుల్ కలాం (రాష్ట్రపతి ఎన్నికల్లో), జయలలిత, ఎం. కరుణానిధి లాంటివారి మీద కూడా పోటీ చేసి ఓడిపోయాడు. దేశంలో ఇన్నిసార్లు పోటీ చేసి ఓడిన ఘనత ఆయనకే దక్కింది. అందుకే ఆయన్ను ‘మోస్ అన్‌సక్సెస్‌ఫుల్ మ్యాన్’ అని బిరుదు ఇచ్చింది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. అయితే, పద్మరాజన్ మాత్రం తనను తాను ఎలక్షన్ కింగ్ అని పిలుచుకుంటారు.

డిపాజిట్లు పోయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. తన ఉద్దేశం పోటీ చేయడమేనని, డిపాజిట్ల కోసం కాదని చెబుతారు.

First published: April 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు