హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BYJU'S Young Genius: ఆరేళ్లకే అద్భుతాలు.. ఈ పంజాబ్ బుడతడి ప్రతిభ చూస్తే షాకవుతారు

BYJU'S Young Genius: ఆరేళ్లకే అద్భుతాలు.. ఈ పంజాబ్ బుడతడి ప్రతిభ చూస్తే షాకవుతారు

కౌటిల్య పండిట్(Photo: Youtube)

కౌటిల్య పండిట్(Photo: Youtube)

సాధారణంగా ఆరేళ్ల పిల్లలు అంటే అప్పుడప్పడే అక్షరాలు నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ అందరినీ ఆనందింప చేస్తుంటారు. అయితే హర్యానా రాష్ట్రానికి చెందిన కర్నాల్ జిల్లాలోని కోహంద్ గ్రామంలో జన్మించిన కౌటిల్య పండిట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.

ఇంకా చదవండి ...

  సాధారణంగా ఆరేళ్ల పిల్లలు అంటే అప్పుడప్పడే అక్షరాలు నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ అందరినీ ఆనందింప చేస్తుంటారు. అయితే హర్యానా రాష్ట్రానికి చెందిన కర్నాల్ జిల్లాలోని కోహంద్ గ్రామంలో జన్మించిన కౌటిల్య పండిట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అసాధారణ ప్రతిభావంతుడైన ఆ బుడతడు ఆరేళ్ల కంటే తక్కువ వయస్సులోనే అనేక విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు టకీమని సమాధానాలు చెప్పి ప్రపంచానే ఆరోగ్యానికి గురి చేశాడు. కంప్యూటర్ లాగా అతను చెప్పే సమాధానాలను చూసిన అనేక మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి అనేక మంది ప్రతిభావంతులైన చిన్నారులను మీ ముందుకు BYJU'S Young Genius కార్యక్రమం ద్వారా తీసుకువచ్చి న్యూస్ 18 ప్రోత్సహిస్తోంది. వారికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

  ఈ BYJU'S Young Genius కార్యక్రమంలో న్యూస్ 18కి చెందిన అన్ని చానళ్లలో శనివారం ప్రసారం అవుతోంది. ఆదివారం అదే ఎపిసోడ్ తిరిగి ప్రసారం అవుతుంది. BYJU'S Young Genius మొదటి ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో మ్యూజిక్ లో రాణిస్తున్న లిడియాన్ నాధసవరం(15), అద్భుతమైన మెమోరీ కలిగిన మెఘాలి మాలబిక(14) కనిపించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ వీరికి మార్గదర్శకం చేయనున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: BYJUS

  ఉత్తమ కథలు