హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Goddess Durga: షర్ట్ బటన్స్, పూసలతో దుర్గామాత చిత్రపటం.. ఈ ఆర్ట్ వర్క్ కి సెల్యూట్ చేయాల్సిందే..!

Goddess Durga: షర్ట్ బటన్స్, పూసలతో దుర్గామాత చిత్రపటం.. ఈ ఆర్ట్ వర్క్ కి సెల్యూట్ చేయాల్సిందే..!

Goddess Durga: షర్ట్ బటన్స్, పూసలతో దుర్గామాత చిత్రపటం.. ఈ ఆర్ట్ వర్క్ కి సెల్యూట్ చేయాల్సిందే..!  (News 18)

Goddess Durga: షర్ట్ బటన్స్, పూసలతో దుర్గామాత చిత్రపటం.. ఈ ఆర్ట్ వర్క్ కి సెల్యూట్ చేయాల్సిందే..! (News 18)

Goddess Durga: దుర్గా పూజల సందర్భంగా కోల్‌కతా వాసులు అమ్మవారిపై భక్తిని ప్రత్యేకంగా చాటుతుంటారు. దుర్గామాత ప్రతిమలను విభిన్న పద్ధతుల్లో రూపొందించి పూజలు చేస్తారు. తాజాగా ఒక కళాకారుడు తన షర్ట్ బటన్స్‌తో అమ్మవారి చిత్రపటాన్ని రూపొదించి ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలో దసరా (Dussera), దీపావళి (Diwali) పండుగల సీజన్‌ వైభవంగా ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో మాత్రం దేవీ నవరాత్రుల వేడుకలు మరింత వైభవంగా జరుగుతాయి. దుర్గా పూజల సందర్భంగా కోల్‌కతా (Kolkata) వాసులు అమ్మవారిపై భక్తిని ప్రత్యేకంగా చాటుతుంటారు. అమ్మవారి ప్రతిమలను విభిన్న పద్ధతుల్లో రూపొందించి పూజలు చేస్తారు. తాజాగా ఒక కళాకారుడు తన షర్ట్ బటన్స్‌తో అమ్మవారి చిత్రపటాన్ని రూపొదించి ఆశ్చర్యపరుస్తున్నాడు.

పశ్చిమ బెంగాల్‌, అలీపుర్‌దువార్ జిల్లాలోని భోలార్ దబ్రీ ప్రాంతానికి చెందిన దీపాంకర్ సాహా అనే కళాకారుడు షర్ట్ బటన్లను ఉపయోగించి దుర్గామాత చిత్రపటాన్ని రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన దీపాంకర్, దుర్గా పూజల సందర్బంగా అమ్మవారిపై తన భక్తిని ఇలా ప్రత్యేకంగా చాటుకున్నట్లు చెబుతున్నారు.

* ఆర్ట్ వర్క్‌పై పట్టు

దీపాంకర్ చిన్నప్పటి నుంచే ఆర్ట్ వర్క్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఈ ఆర్ట్‌వర్క్‌లో ప్రత్యేకత చాటుతున్నారు. ఆయన పెన్సిల్‌తో చిత్రాలు గీయడం దగ్గరి నుంచి ఆయిల్ పెయింటింగ్, ఇతర క్రాఫ్ట్ వర్క్స్‌పై పట్టు సాధించారు. దీపాంకర్ డ్రాయింగ్ టీచర్ కూడా. తన ఇంట్లో కొంతమంది విద్యార్థులకు డ్రాయింగ్ నేర్పించారు.

‘నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ వర్క్ అంటే ఇష్టం. అయితే ఇలాంటి కళాకృతులపై పట్టు సాధించడానికి చాలా సంవత్సరాలు మా ఊరికి, ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. నేను ప్రభుత్వ ఉద్యోగిని. రోజంతా ఉద్యోగంలో బిజీగా ఉంటాను. సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వరకు ఆర్ట్ వర్క్స్ చేస్తాను. నా కుటుంబం మద్దతుతో ఇలా ఆర్ట్ వర్క్‌లో పట్టు సాధించగలిగాను. చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఈ విషయంలో నాకు తోడున్నారు’ అని దీపాంకర్ తెలిపారు.

* ఈసారి కొత్తగా..

గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంట్, సబ్బుతో వివిధ కళాకృతులను, శిల్పాలను (sculpture) తయారు చేసిన దీపాంకర్.. ఈసారి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కొత్తగా బటన్, పూసలతో దుర్గా దేవి ప్రతిమను తయారు చేయాలనుకున్నారు. ఈ దుర్గాదేవి రూపానికి ‘చిన్మయి మాత’ అనే పేరు పెట్టారు. ఈ ప్రతిమ సైజు 24 X 18 అంగుళాలు. మొత్తం 1675 బటన్లు, అనేక పూసలతో ఈ దేవత రూపాన్ని రూపొందించారు.

ఇది కూడా చదవండి : పశ్చిమ్ బెంగాల్‌లో రేడియో అంకుల్.. నవరాత్రుల సమయంలో ఈయనో సెలబ్రిటీ!

దీపాంకర్ వివిధ జిల్లాలతో పాటు ఇతర దేశాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లు, ప్రదర్శనల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేక విషయాలపై కొత్త ఆలోచనలతో పని చేస్తానని చెబుతున్నాడు. ఈ రంగంలో తన విజయానికి ఎంతగానో సహకరించిన తల్లిదండ్రులు, భార్యతో సహా తన కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

(Story: Ananya Dey)

Published by:Sridhar Reddy
First published:

Tags: Durga Pooja, Kolkata, Navaratri, VIRAL NEWS

ఉత్తమ కథలు