తీహార్ జైలుకు మీరట్ తలారి.. నిర్భయ నిందితులను ఉరి తీసేందుకేనా..?

బుధవారం తీహార్ జైలు నుంచి ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీకి ఓ లేఖ అందింది. తీహార్ జైలుకి తలారిని పంపించాలని లేఖలో కోరారు.

news18-telugu
Updated: December 11, 2019, 10:49 PM IST
తీహార్ జైలుకు మీరట్ తలారి.. నిర్భయ నిందితులను ఉరి తీసేందుకేనా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశా నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత నిర్భయ గ్యాంగ్ రేప్ నిందితుల ఉరిశిక్ష ఎప్పుడు అన్న ప్రశ్న చర్చల్లో నానుతూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగట్లేదని నిర్భయ తల్లిదండ్రులు వాపోతున్నారు.దిశా ఘటనలో సత్వర న్యాయం తర్వాత నిర్భయ ఉదంతంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితులను ఉరితీసేందుకు అంతా సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిర్భయ నిందితులు శిక్ష అనుభవిస్తున్న తీహార్ జైలుకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి తలారిని పంపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

బుధవారం తీహార్ జైలు నుంచి ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీకి ఓ లేఖ అందింది. తీహార్ జైలుకి తలారిని పంపించాలని లేఖలో కోరారు. అయితే ఎవరిని ఉరితీసేందుకు అన్నది అందులో పేర్కొనలేదు.నిర్దోషులం అని నిరూపించుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయిన కొందరు నిందితులను ఉరివేసేందుకు అని మాత్రమే అందులో పేర్కొన్నారు.

కాగా,ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు తలారిలు మాత్రమే ఉన్నారు. వీరిలో మీరట్ జైలు తలారి పవన్ కుమార్‌ను తీహార్ జైలుకు పంపించనున్నట్టు సమాచారం. 2015లో పవన్ కుమార్ వార్తల్లో నిలిచాడు. అప్పట్లో తనకు రావాల్సిన నెలవారీ భత్యం రూ.3వేలు రానందుకు ఆఫీసర్ల చుట్టూ తిరిగి వేడుకున్నాడు. కాగా, ఇండియాలో అధికారికంగా నమోదు చేసుకున్న తలారీల్లో పవన్ కుమార్ ఒకరు. గతంలో నిఠారి సీరియల్ కిల్లర్ సురేందర్‌ కోలిని పవన్ కుమారే ఉరితీశాడు.

First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>