• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MEERUT GIRL RAPED BY GUEST HOUSE OWNER SON WITH THE HELP OF POLICE AFTER SHE WENT WITH A BOY IN UP HSN

నిర్మానుష్యంగా ఉన్న అతిథిగృహం.. యువకుడితో వెళ్లిన ఓ యువతి.. గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూసి..

నిర్మానుష్యంగా ఉన్న అతిథిగృహం.. యువకుడితో వెళ్లిన ఓ యువతి.. గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూసి..

ప్రతీకాత్మక చిత్రం

అసలు మీరు ఎవరు? మీ అమ్మానాన్నలకు ఫోన్ చేయండి అంటూ ఆ పోలీసులు ఆ జంటను భయపెట్టారు. అదే సమయంలో ఆ గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు ఎంట్రీ ఇచ్చాడు. ఏం జరుగుతోందంటూ వారిని నిలదీశాడు. పోలీసులను పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత..

  • Share this:
    ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ఓ గెస్ట్ హౌస్ కు వెళ్లింది. వారిద్దరూ సరదాగా కూర్చుని మాట్లాడుతుండగా గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూశాడు. అదే అదనుగా భావించాడు. తనకు తెలిసిన ఇద్దరు పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ ఇద్దరు పోలీసులు వచ్చి ’రైడ్‘ డ్రామా ఆడారు. ఈ సమయంలో మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు.? వ్యభిచారం చేస్తున్నారా? అసలు మీరు ఎవరు? మీ అమ్మానాన్నలకు ఫోన్ చేయండి అంటూ ఆ పోలీసులు ఆ జంటను భయపెట్టారు. అదే సమయంలో ఆ గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు ఎంట్రీ ఇచ్చాడు. ఏం జరుగుతోందంటూ వారిని నిలదీశాడు. పోలీసులను పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ జంట వద్దకు వచ్చాడు. ’నాకు సహకరిస్తే ఈ కేసు నుంచి మిమ్మల్ని బయటపడేస్తా‘ అన్నాడు. లేదంటే పత్రికల్లో రచ్చ రచ్చ అవుతుందని బెదిరించాడు. చివరకు ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత పోలీసులు ఆ జంట వద్ద ఉన్న డబ్బును తీసుకుని ఎస్కేప్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా నాచండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అతిథి గృహం ఉంది. అక్కడకు సాధారణంగా ఎవరూ రారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఆ అతిథిగృహానికి ఫిబ్రవరి 20వ తారీఖున శనివారం ఓ యువతి తనకు తెలిసిన యువకుడితో కలిసి వెళ్లింది. అతడితో ఆ గెస్ట్ హౌస్ లో కూర్చుని మాట్లాడుతోంది. దీన్ని ఆ గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూశాడు. తనకు తెలిసిన పోలీసులకు ఫోన్ చేసి అక్కడకు రప్పించాడు. పోలీసులు రైడ్ అంటూ వారిని బెదిరించి భయపెట్టారు. కేసులంటూ పోలీసులు అంటుండగా అక్కడకు ఆ గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు ఎంట్రీ ఇచ్చాడు. యువతీయువకులను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడి పోలీసులను పక్కకు తీసుకెళ్లాడు.
    ఇది కూడా చదవండి: ఇష్టపడిన అమ్మాయితో పెళ్లయిన నాలుగు నెలలకే ఘోరం.. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి..

    ఆ తర్వాత ఆ యువతి వద్దకు వచ్చి ’నాకు సహకరిస్తే ఈ కేసు నుంచి మీరు తప్పించుకోవచ్చు. లేదంటే ఈ విషయం మీ అమ్మానాన్నలకు తెలిసిపోతుంది. పేపర్లలో వస్తుంది. పరువు పోతుంది‘ అంటూ బెదిరించాడు. ఆ యువతితోపాటు వచ్చిన యువకుడిని కూడా భయపెట్టాడు. ఆమె ఒప్పుకోకున్నా బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పోలీసులు కూడా ఆ యువతీయువకుల వద్ద ఉన్న డబ్బును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న నాచండి పోలీస్ స్టేషన్ కు ఆ యువతి వెళ్లింది. ఘటనపై ఫిర్యాదు చేయగా ఎవరూ స్వీకరించలేదని ఆ యువతి వాపోయింది. ఆ గెస్ట్ హౌస్ కు వచ్చిన ‘పోలీసులు, ఆ స్టేషన్ కు చెందిన వారే కావడంతో కేసు నమోదు చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వార్త బయటకు రావడంతో ఆ స్టేషన్ సీఐ స్పందించారు. ’ఫిర్యాదు ఇచ్చేందుకు మా దగ్గరకు ఎవరూ రాలేదు. అనవసరంగా పోలీసులపై నిందలు వేస్తున్నారు.‘ అంటూ సీఐ ప్రేమ్ చంద్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
    ఇది కూడా చదవండి: కోడి కాలికి కత్తిని కట్టాడు.. రెండో కాలికి కూడా కడుతుండగా పరార్.. మర్మాంగాలకు తగిలిన కోడి కత్తి.. చివరకు..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు