MEENU RAHEJA IS THE SHORTEST LAWYER IN THE COUNTRY AND IS A HARYANA WOMAN WHO HOLDS MANY RECORDS SNR
ఆమె రెండున్నర అడుగుల బుల్లెట్.. ఏం చేస్తుందో తెలుసా..?
Photo Credit:Twitter
Haryana: ఎంత ఎత్తు ఉన్నామనేది ముఖ్యం కాదు. ఎంత ఎత్తుకు ఎదిగాము అన్నదే పాయింట్. హర్యానాకు చెందిన 2 అడుగులు 9 అంగుళాల ఎత్తు కలిగిన ఓ మహిళ కోర్టులో కేసులు వాదిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే అతిపొట్టి అడ్వకేట్‌గా పేరు తెచ్చుకొని వార్తల్లోకి ఎక్కారు మీను రహేజా.
ఎంత ఎత్తు ఉన్నమనేది పాయింట్ కాదు...ఎంత ఎత్తు ఎదిగాము అన్నదే ముఖ్యం. హర్యానాకు చెందిన ఓ యువతి అలాంటి క్రెడిట్నే సొంతం చేసుకుంది. కేవలం రెండు అడుగుల తొమ్మిది అంగుళాల (2 Feet 9 inches)పొడవున్న మీను రహేజా(Meenu raheja)దేశంలోనే అత్యంత పొట్టి లాయర్(India shortest advocate)గా పేరు సంపాధించున్నారు.. ఎత్తు తక్కువైన ఆమెలో ఉన్న ఆత్మస్థైర్యం హిమాలయాలను సైతం ఎక్కగలను అనే అంతగా ఉంది. అందుకే తన స్వశక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ సమాజంలో ఓ ఫేమస్ అడ్వకేట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మీను రహేజా. హర్యానా(Haryana)లోని హిసార్(Hissar)ప్రాంతానికి చెందిన మీను రహేజా(Meenu Raheja)ను చూసి ఏం చేస్తుందిలే అని నవ్విన వాళ్లు ఉన్నారు. ఆమె పుట్టకతో వచ్చిన లోపాన్ని చూసి అవహేళన చేసిన వాళ్లు ఉన్నారు. కానీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అన్నింటిని అధిగమిస్తూ ముందుకు సాగింది. ఆమెలోని ఆ మొండి ధైర్యమే ఇవాళ పెద్ద పెద్ద వాళ్లు సైతం లాయర్ మీను రహేజా వస్తోందంటే లేచి సెల్యూట్ (Salute)చేసే స్థాయికి ఎదిగారు.
ఎవరికి అందనంత ఎత్తుకి..
భగవంతుడు ఆడపిల్లగా పుట్టించాడని బాధపడలేదు. శారీరక వికలాంగురాలిని అని కుమిలిపోలేదు. సమాజం ఎంత చిన్నచూపు చూసినా..ఏం చేస్తావులే అని నిరుత్సాహపరిచినప్పటికి తాను కుంగిపోలేదు అంటున్నారు మీను రహేజా. అందరిలా కాకుండా తనకున్న లోపాన్ని అర్హతగా మార్చుకొని అందరి శారీరక వికాలాంగుల్లా కుంగిపోకుండా తన కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు మీను రహేజా. 2012వ సంవత్సరం నుంచి లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న మీను రహేజాకు మధ్యలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. అయినా తాను మహిళలు, పేదల సామాజిక అభ్యున్నతి కోసం తన వంతు సాయం చేయాలనే ఈ లాయర్ వృత్తిలో కొనసాగుతున్నానని చెప్పారు. తాను లాయర్‌గా ప్రాక్టీస్ చేపట్టి నాటి నుంచి ఇప్పటి వరకూ 100పైగా అవార్డులు అందుకున్నారు ఈ షార్టెస్ట్ అడ్వకేట్ మీను రహేజా.
అమె మనోధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..
అవయవలోపం, అంగవైకల్యం కేవలం శరీరానికే కాని మనసు కాదని నిరూపించారు మీను రహేజా. అంతే కాదు రహేజా కృష్ణ దివ్యాంగ్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు. తన తల్లి పేరుతో స్థాపించిన ఆ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నానని చెబుతున్నారు మీను రహేజా. చిన్ననాటి నుంచి హేళనలు, ఆటపట్టించడాలు వంటి వాటిని లెక్క చేయలేదు కాబట్టే ఇవాళ నేను 1500మందికి సేవ చేయగలుగుతున్నానని చెప్పారు. పాటలంటే ఎంతో ఇష్టపడే తాను..లాయర్ వృత్తిని ఎంచుకున్న తర్వాత వాటిని మర్చిపోవాల్సి వచ్చిందని తెలియజేశారు అతి కురచైన న్యాయవాది మీను రహేజా.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.