అంబులెన్స్‌లో కరోనా రోగులు. రోడ్డుపై 45 సెం.మీ. మంచు. వైద్య సిబ్బంది సాహసం. ప్రశంసల జల్లు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న లెక్కనేనన్ని ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ఒకటి హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మండి దగ్గర జరిగింది. ఆ వివరాలు అందరూ చలించేలా చేస్తున్నాయి.

news18-telugu
Updated: November 18, 2020, 12:40 PM IST
అంబులెన్స్‌లో కరోనా రోగులు. రోడ్డుపై 45 సెం.మీ. మంచు. వైద్య సిబ్బంది సాహసం. ప్రశంసల జల్లు
అంబులెన్స్‌లో కరోనా రోగులు. రోడ్డుపై 45 సెం.మీ. మంచు. వైద్య సిబ్బంది సాహసం. ప్రశంసల జల్లు (Credit: IG/ @ani_trending)
  • Share this:
చావు బ్రతుకలు మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్ల (covid patients) పరిస్థితి విషమించింది. వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలంటూ వచ్చిన ఫోన్ కాల్‌తో హిమాచల్ ప్రదేశ్ మెడికల్ స్టాఫ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కానీ ఫోన్ కాల్ వచ్చిన ప్రాంతం నుంచి ఆసుపత్రికి వారిని తరలించే మార్గమంతా మంచు మయం అయిపోయింది. మరి అంబులెన్స్ ఆ ప్రాంతాన్ని చేరుకునేదెలా? అక్కడి నుంచి రోగులను తరలించేది ఎలా? ఏమాత్రం ఆలస్యం అయినా రెండు నిండు ప్రాణాలు పోతాయన్న ఆలోచన మరోవైపు. క్షణ మాత్ర సమయం కూడా వృథా చేయని అంబులెన్స్ డ్రైవర్ (Ambulance driver), మెడికల్ టెక్నీషియన్.... తమ ప్రాణాలకు తెగించి రోగుల దగ్గరకు వీలైనంత త్వరగా చేరుకున్నారు. కీలాంగ్‌లో ఇద్దరు కరోనా రోగుల పరిస్థితి విషమించిందన్న డాక్టర్ల సమాచారంతో వృత్తి ధర్మాన్ని పాటించేందుకు సర్వం ఒడ్డారు. కానీ ఆ తరువాతే అసలు తిప్పలు ప్రారంభమయ్యాయి.

45 సెం.మీ. మంచులో కూరుకుపోయిన అంబులెన్స్:

మంచు కప్పేసిన రోడ్లపై 45 సెంటీమీటర్ల మేర మంచు వాన కురిసింది. రోడ్డుపైన ఉన్న మంచులో కూరుకుపోయిన అంబులెన్స్ ముందుకు కదిలే మార్గమే లేదు. దీంతో ప్రాణాలకు తెగించిన ఎమర్జెన్సీ మెడికల్ స్టాఫ్ చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి (Mandi) దగ్గర్లోని లాహౌల్ లోయలో మంచులో కూరుకుపోయిన అంబులెన్స్‌ను అత్యంత సాహసోపేతంగా నడిపించిన డ్రైవరు మనోజ్, మెడికల్ టెక్నీషియన్ (medical technician) జే లలిత అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. సుమారు 30-45 సెంటీమీటర్ల మేర పేరుకున్న దట్టమైన మంచును తొలగించేందుకు వీరు నానా అగచాట్లు పడ్డారు.

తోసుకుంటూ:
విపరీతమైన మంచు వానతో మనాలి-అటల్ టన్నెల్ కీలాంగ్ హైవే మంచు దుప్పటిలో కూరుకుపోయింది. దీంతో ఇక్కడ రాకపోకలు సాధ్యపడటం లేదు. అంబులెన్స్ లోని రోగులను నేర్ చౌక్ లోని ఆసుపత్రికి తక్షణం తరలించకపోతే ప్రాణాపాయం తప్పదు. కానీ 108 నేషనల్ అంబులెన్స్ సర్వీసు వాహనాన్ని మంచులో నడిపే అవకాశం లేదు. ఎందుకంటే ఈ వాహనాన్ని మంచులో నడిపేందుకు వీలుగా డిజైన్ చేయలేదు. దీంతో మనోజ్, జే ఇద్దరూ కలిసి వాహనాన్ని ముందుకు తోయడం తప్ప మరే మార్గం లేదు. అలాగే తోసుకుంటూ, వాహనాన్ని ఎలాగొలా కదిలించారు.
ఆలస్యంగా వెలుగులోకి:
108 అంబులెన్స్ సర్వీసు (ambulance service) ఇంఛార్జ్ అశిష్ శర్మ వీరిద్దరినీ అభినందించడంతో అసలు విషయంగా ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. అత్యంత ప్రమాదకరమైన ప్రయాణమైనప్పటికీ తమ ఉద్యోగులు విధుల్లో ఆటంకం తలెత్తకుండా సేవ చేసేందుకు మొగ్గు చూపినట్టు శర్మ మీడియాకు తెలిపారు. అసలు రోగుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదని చెప్పిన వెంటనే రెండో ఆలోచన లేకుండా, ఎలాంటి ప్రశ్నలు అడక్కుండా తమ సిబ్బంది రోగులను తరలించే పనిలో పడినట్టు ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: Human Cell: కణం ఫొటోను చూపించిన నాసా... రాత్రివేళ దీపావళిలా ఉందంటున్న నెటిజన్లు

ప్రశంసల జల్లు:
మెడికల్ సిబ్బంది చూపిన చొరవ, ధైర్య సాహసాల (adventure)ను ఇప్పుడు యావత్ దేశం ప్రశంసిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఏటా ఇలా మంచు వర్షం కారణంగా నిమోనియా వంటి రోగాలతో బాధపడే రోగులను అంబులెన్స్‌లో తరలించడం అంటే పెద్ద సాహసంగా మారుతోంది. ఈ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు వైద్య సాయం అందించడమంటే వైద్య సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతోంది. విపరీతమైన మంచు వానతో ఇక్కడి కొన్ని ప్రాంతాలకు నెలల తరబడి బయట ప్రంపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్య సేవలు అందించేందుకు ఇక్కడి మెడికల్ స్టాఫ్ తపించడం అభినందనీయమైన విషయం. కానీ మీడియాలో మాత్రం ఈ విషయాలన్నీ చాలా అరుదుగా కనిపిస్తాయి.
Published by: Krishna Kumar N
First published: November 18, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading