Home /News /national /

MEDICAL COLLEGE IN EVERY DISTRICT OF THE COUNTRY MODI WILL BRING IN A RECORD NUMBER OF DOCTORS FROM INDIA IN TEN YEARS GH VB

PM Modi: దేశంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్‌.. పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు వస్తారన్న మోదీ..!

ప్రధాని మోదీ(file)

ప్రధాని మోదీ(file)

గుజరాత్‌లోని భుజ్‌లో ఉన్న కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ(Medical College) ఉండాలని భావిస్తున్నామని, వచ్చే పదేళ్లలో భారతదేశం రికార్డు స్థాయిలో వైద్యులను తయారు చేస్తుందని ప్రధాని న

ఇంకా చదవండి ...
గుజరాత్‌(Gujarat) రాష్ట్రంలోని భుజ్‌లో ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని(Super Specialty Hospital) ప్రధాని నరేంద్ర మోదీ(Modi) శుక్రవారం ప్రారంభించారు. తక్కువ ధరలకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అన్ని రకాల వైద్య సేవలు ఈ ఆస్పత్రిలో(Hospital) ప్రజలకు అందనున్నాయి. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో(Video Confidence) కొన్ని కీలక అంశాలను ప్రధాని మోదీ వెల్లడించారు. గుజరాత్‌లో మెడికల్‌ కాలేజీల సంఖ్య, విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేందుకు పెరిగిన అవకాశాలను వివరించారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీని(Medical College) ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రానున్న పదేళ్లలో అత్యధికంగా వైద్యులను భారతదేశం తయారు చేస్తుందని తెలిపారు.

గుజరాత్‌లోని భుజ్‌లో ఉన్న కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌(K K Patel Super Specialty Hospital)ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ(Medical College) ఉండాలని భావిస్తున్నామని, వచ్చే పదేళ్లలో భారతదేశం రికార్డు స్థాయిలో వైద్యులను తయారు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉండేవని, అయితే గత 20 ఏళ్లలో వైద్య విద్య రంగం చాలా మెరుగుపడిందని మోదీ చెప్పారు.

Electric Car: సింగిల్ ఛార్జ్‌తో 1,000 కిలోమీటర్లు.. ఈ EV Car మాములుగా లేదుగా..


వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక AIIMS( All India Institute of Medical Sciences), మూడు డజన్లకు పైగా వైద్య కళాశాలలు ఉన్నాయి. గతంలో గుజరాత్‌లోని మెడికల్ కాలేజీల్లో కేవలం 1,000 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు గుజరాత్‌లోని మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది వైద్య విద్యను అభ్యసించ గలుగుతున్నారు. రాజ్‌కోట్‌లోని ఎయిమ్స్‌లో 2021 నుంచి 50 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు.’ అని మోదీ చెప్పారు.

గుజరాత్‌లో కేకే పటేల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో..‘ గుజరాత్‌ రాష్ట్రంలోని భుజ్‌లోని శ్రీ కుచ్చి లెయువా పటేల్ సమాజ్ కేకే పటేల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించింది. ఇందులో 200 పడకలు ఉన్నాయి. కచ్‌లోని మొదటి ఛారిటబుల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఇదే.

Inflation: మార్చిలో 17 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో వీటి ధరలు పెరిగే అవకాశం..?


ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ (క్యాథ్‌లాబ్), కార్డియోథొరాసిక్ సర్జరీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, జాయింట్ రీప్లేస్‌మెంట్, లాబొరేటరీ వంటి ఇతర సహాయక సేవలు ఈ సూపర్-స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి.’ అని పేర్కొంది. ఈ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సరసమైన ధరలలో ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Published by:Veera Babu
First published:

Tags: Gujarat, Hospitals, Medical, Medical college, Pm modi, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు