అయోధ్యకు ఆ ఒక్కటే పరిష్కారం.. మధ్యవర్తులతో కాదన్న శివసేన

రామజన్మభూమి వివాదం లోక్‌సభ ఎన్నికల తర్వాతే పరిష్కారం అవుతుందని శివసేన అభిప్రాయపడింది.

news18-telugu
Updated: March 9, 2019, 5:26 PM IST
అయోధ్యకు ఆ ఒక్కటే పరిష్కారం.. మధ్యవర్తులతో కాదన్న శివసేన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన పార్టీ స్పష్టం చేసింది. భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో మధ్యవర్తులతో పనికాదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించాలని శివసేన పార్టీ.. అధికార పత్రిక సామ్నాలో డిమాండ్ చేసింది. దేశంలో వేలాది మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు కూడా పరిష్కరించలేని అంశాన్ని ముగ్గురు మధ్యవర్తులు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించింది. అయోధ్య రామమందిరం - బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించే క్రమంలో సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎమ్‌ఐ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా కమిటీని నియమించింది.

రామజన్మభూమి వివాదం లోక్‌సభ ఎన్నికల తర్వాతే పరిష్కారం అవుతుందని శివసేన అభిప్రాయపడింది. ‘ఇందులో ఒకటే ప్రశ్న. చర్చలతో సమస్య పరిష్కారం అయ్యేదే అయితే, పాతికేళ్లుగా వివాదంగానే ఎందుకు ఉండిపోయింది? ఎందుకు వందలాది మంది దానికోసం చనిపోయారు?’ అని శివసేన పార్టీ ప్రశ్నించింది. అయోధ్య వివాదం అనేది 1500 చదరపు అడుగుల భూమిని సంబంధించిన అంశం కాదని, కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంమని శివసేన చెప్పింది.
First published: March 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading