Home /News /national /

MEDIATION HAS FAILED SAYS SUPREME COURT DAILY HEARINGS TO BEGIN FROM AUGUST SIX MS

అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం విఫలం.. తిరిగి సుప్రీం చేతికి విచారణ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ayodhya Dispute : ఒకవేళ మధ్యవర్తిత్వం విఫలమైతే తాము మళ్లీ జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. చెప్పినట్టుగానే మధ్యవర్తిత్వం విఫలం కావడంతో ఇప్పుడు కేసులో జోక్యం చేసుకోబోతోంది.

    అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వం విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేసును తిరిగి న్యాయస్థానమే విచారిస్తుందని తెలిపింది. అగస్టు 6వ తేదీ నుంచి రెగ్యులర్ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.అయోధ్య రామజన్మభూమి వివాదంపై గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ ఈరోజు న్యాయస్థానానికి నివేదిక అందజేసింది.కమిటీ రిపోర్టుపై సుప్రీం పెదవి విరిచింది.మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని సుప్రీం భావించింది. దీంతో మధ్యవర్తిత్వాన్ని తొలగిస్తున్నట్టు తెలిపింది. తిరిగి సుప్రీం ధర్మాసనమే దీనిపై విచారణ చేపట్టబోతున్నట్టు ప్రకటించింది.

    కాగా, అయోధ్య రామజన్మభూమి వివాదంపై గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ తమ నివేదికను న్యాయస్థానానికి అందజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా నియమించిన కమిటీ తమ రిపోర్టును సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. ఆ కమిటీ.. ఇరువర్గాల తరఫున మధ్యవర్తిత్వం వహించి కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేలా ప్రయత్నించడానికి ఆస్కారం కల్పించింది. ఈ కమిటీకి తొలుత జూలై 25 డెడ్‌లైన్ విధించింది. అయితే ఆ తర్వాత మరికొన్ని రోజులు గడువు పొడిగించింది.ఒకవేళ మధ్యవర్తిత్వం విఫలమైతే తాము మళ్లీ జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. చెప్పినట్టుగానే మధ్యవర్తిత్వం విఫలం కావడంతో ఇప్పుడు కేసులో జోక్యం చేసుకోబోతోంది.

    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Ayodhya Ram Mandir, Babri masjid, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు