HOME »NEWS »NATIONAL »mba degree holder and married ap woman become aghori tantrik sb

ఎంబీఏ చదవి అఘోరాగా మారిన తెలుగు అమ్మాయి

ఎంబీఏ చదవి అఘోరాగా మారిన తెలుగు అమ్మాయి
భర్త, కూతుర్ని వదిలి అఘోరాగా మారిన ఏపీ అమ్మాయి

అయితే ఈమె అఘోరాగా మారడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఈమె శివభక్తురాలు. శివుడంటే ఎంతో భక్తి. మరి ఆయన ఉండేది మాత్రం స్మశానంలోనే.

  • Share this:
    ఆమె అందరిలా ఓ సాధారణ మహిళ. అందరమ్మాయిలు చదువుకునే విధంగానే ఉన్నత చదవులు చదివింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. హెచ్ఆర్‌లో ఎంబీయే కూడా చేసింది. పెళ్లి కూడా చేసుకుని పండంటి ఆడబిడ్డను కూడా జన్మనిచ్చింది. అయితే ఇదంతా ఎనిమిదేళ్ల నాటి కథ. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది.


    ఇప్పుడామె అందరిలా సాధారణ మహిళ కాదు కదా సాధరణ మనిషి కూడా కాదు. అఘోరాల మారిపోయింది. రాత్రులు బయటకు వెళ్లాలంటేనే మహిళలు భయపడే ఈ రోజుల్లో... ఆమె మాత్రం స్మశానాల్లో శివ తపస్సు చేసుకుంటూ గడుపుతుంది.




    అయితే ఈమె అఘోరాగా మారడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.ఈమె శివభక్తురాలు. శివుడంటే ఎంతో భక్తి. మరి ఆయన ఉండేది మాత్రం స్మశానంలోనే. అందుకే ఆమె శివుడ్ని మనసారా స్మరించే ఉద్దేశంతోనే అఘోరాగా మారిపోయింది.


    ఈమె అసలు పేరు ప్రత్యంగీర్. స్వస్థలం ఆంధ్రప్రదేశ్. అందరిలా ఈమె కూడా సాధారణ జీవనం గడిపేది. తన కూతరంటే కూడా ఆమెకు ఎంతో ప్రేమ. అయితే ఎప్పుడైతే ప్రత్యంగీర్ మదిలో అఘోరా అవ్వాలనే ఆలోచన వచ్చిందో అప్పుడే ఆమె అన్నింటిని వదిలేసింది.


    ప్రత్యంగీర్ తన వేలికి ఓ ప్రత్యేకమైన ఉంగరాన్ని కూడా ధరిస్తుంది. దానిపై మహాకాల్ రూపంలోని బొమ్మ ఉంది. అయితే అఘోరాలు మహాంకాల్, మహాంకాళిని అంటే.. శివపార్వతుల్ని ఆరాధిస్తారని చెప్పుకొచ్చింది. వీరు మాట్లాడే భాషా కూడా వేరేగా ఉంటుందని తెలిపింది. తామెప్పుడు హలో అని పలకరించమని చెప్పింది ప్రత్యంగీర్.


    kumbh mela

    కుంభమేళాలో కనిపించిన ఈ మహిళా అఘోర అందరి దృష్టిని ఆకర్షించింది. రుద్రాక్షలు వేసుకుంటూ అఘోరాలతో కలిసి తిరిగింది. లోక కళ్యాణం కోసం అఘోరాగా మారనని చెప్పింది. స్మశానానికి వెళ్లడం వల్ల తనకు ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుందని తెలిపింది.


    kumbha mela
    కుంభమేళా సందర్భంగా రకరకాల అఘోరాల కథలు తెరపైకి వస్తున్నాయి. కుంభమేళాలో వీరంతా ఓ కుండ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో త్రిశూలం ఉంచుతు ... పూజలు చేస్తున్నారు.


    ప్రత్యంగీర్ అఘోరాగా మారిన అంశం వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఒక అంశంపై అందరికీ ఓ స్పష్టత వస్తుంది. అఘోరాలంటూ కేవలం చదువురానివాళ్లు, సాధువులు సన్యాసులు అనే అపోహ ఉండదే. ఇప్పుడు డిగ్రీలు, పీజీలు చదివిన వారు సైతం అఘోరాలుగా మారుతుండటంతో జనం కూడా తమ ఆలోచనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.


    .
    First published:February 13, 2019, 12:50 IST