Home /News /national /

MAYAWATI ON STAGE AJIT SINGH HAS TO TAKE OFF SHOES NK

మాయావతి ముందు ఎవరైనా షూ విప్పాల్సిందే... అజిత్ సింగ్‌కు చేదు అనుభవం...

మాయావతి, అజిత్ సింగ్

మాయావతి, అజిత్ సింగ్

Lok Sabha Election 2019 : తన స్థాయి మిగతా నేతల కంటే అత్యున్నతమని చెప్పుకునేందుకు మాయావతి ఈ ఎత్తుగడ వేశారా...

రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటే సరిపోదు... ఒక్కోసారి ఘోర అవమానాల్ని కూడా భరించాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకున్న RLD అధినేత అజిత్ సింగ్‌కి చేదు అనుభవం ఎదురైంది. రెండు పార్టీలూ... షహరాన్‌పూర్‌లో కలిసి ర్యాలీ నిర్వహించాయి. అక్కడో బహిరంగ సభ ఉంది. ఆ సభా వేదికపైకి అఖిలేష్, మాయావతీ మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే... కాస్త వెనకాల వాళ్లను ఫాలో అవుతున్నారు అజిత్ సింగ్. ఇంతలో బీఎస్పీ కోఆర్డినేటర్... ఆ 80 ఏళ్ల జాట్ల నేతను అడ్డుకున్నారు. 63 ఏళ్ల మాయావతికి... తన ముందు ఎవరైనా షూస్ వేసుకొని కనిపిస్తే నచ్చదని అన్నారు. ఆమె మాత్రమే షూస్ వేసుకోవాలనీ, వేదికపై ఇంకెవరూ షూస్‌తో ఉండరాదని అన్నారు. షాకవ్వడం అజిత్ సింగ్ వంతైంది.

తనకంటూ సొంత ప్రోటోకాల్ పెట్టుకున్నారు దళిత వర్గం నేతైన మాయావతి. ఎవరైనా ఆమెను చేరాలంటే ముందుగా షూస్ తీసేయాల్సిందే. తనకు దుమ్ము అంటే అలర్జీ అని చెప్పుకుంటారామె. ఉత్తరప్రదేశ్ చరిత్రలో దళితులు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. జాట్లు ఇతర కులాల వారు... దళితులపై ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు రోజులు మారాయి. మాయావతి టైం నడుస్తోంది. ఫలితమే అజిత్ సింగ్‌కి అవమానం అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం మాయావతికి యూపీలో ఒక్కటంటే ఒక్కటీ లోక్ సభ స్థానం లేదు. అయినప్పటికీ ఆమె దళితుల్నీ, యాదవుల్నీ ఇతర వర్గాల వారిని గ్రిప్పులో పెట్టుకున్నారు. ఫలితంగానే యాదవుల పార్టీగా చెప్పుకునే సమాజ్ వాదీ పార్టీ సైతం... మాయావతితో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. ఈ అవమానానికి సంబంధించి... RLD వర్గాలు మౌనం వహించేందుకే సిద్ధపడుతున్నాయి. అజిత్ సింగ్ ఆ వేదికను ఎంతో పవిత్రమైనదిగా భావించారనీ, అందువల్ల షూస్ తీసేసి... వేదికపైకి వెళ్లారని సర్దిచెప్పుకుంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.


యూపీలోని 80 లోక్ సభ స్థానాల్లో 2014లో 69 స్థానాలు దక్కించుకున్న బీజేపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ చేతులు కలపగా... అంతా తానే అయ్యి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మాయావతి. వేదికపై ముందు వరుసలో ఎవరుండాలో, రెండో వరుసలో ఎవరు కూర్చోవాలో కూడా ఆమే డిసైడ్ చేస్తున్నారు. ఎవరెవరు మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి. అన్నీ మాయా చెప్పినట్లే జరుగుతున్నాయి.

2014లో బీజేపీ ప్రత్యర్థి సత్యపాల్ సింగ్ చేతిలో ఓడిపోయారు అజిత్ సింగ్. ఈసారి ఏప్రిల్ 11న జరిగిన తొలి దశలో ముజఫర్ నగర్ స్థానం నుంచీ పోటీ చేశారు. ఆయన కొడుకు జయంత్ చౌదరి... కంచుకోటగా చెప్పుకునే భాగ్‌పాట్ నుంచీ బరిలో దిగారు. అక్కడ దళితుల ఓట్లు రాబట్టుకునేందుకు అజిత్ సింగ్... మాయావతిపై ఆధారపడ్డారు.

 

ఇవి కూడా చదవండి :

ష్... డిటెక్టివ్స్ గమనిస్తున్నారు... ఎన్నికల్లో గెలుపు కోసం రంగంలోకి డిటెక్టివ్స్

వారణాసి నుంచీ ప్రియాంక గాంధీ... మోదీకి పోటీగా బరిలో నిలిచే సంకేతాలు...


జుకెర్‌బర్గ్ సెక్యూరిటీ కోసం రూ.138 కోట్లు... జీతం మాత్రం ఏడాదికి ఒక డాలరే...

First published:

Tags: Ajith, Bsp, Mayawati, Sp-bsp, Uttar Pradesh Lok Sabha Elections 2019

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు