ఎస్పీతో బీఎస్పీ తెగతెంపులు... ఇక అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి...

SP BJP Alliance : అంతా అయిపోయింది. ఎన్నికల తర్వాత ఎస్పీ, బీఎస్పీ విడిపోతాయని బీజేపీ నేతలు చెప్పినట్లే జరిగింది. ఇక ఆ పార్టీలు వేర్వేరు దారులు చూసుకుంటున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 1:33 PM IST
ఎస్పీతో బీఎస్పీ తెగతెంపులు... ఇక అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి...
అఖిలేష్ యాదవ్, మాయావతి
  • Share this:
లోక్ సభ ఎన్నికల్లో... ఉత్తరప్రదేశ్‌లో భారీగా సీట్లు సాధించి... కేంద్రంలో చక్రం తిప్పాలని కలలుకన్న ఎస్పీ, బీఎస్పీ... అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో... ఇప్పుడు ఆ రెండు పార్టీలూ... ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎస్పీని టార్గెట్ చేస్తూ... బీఎస్పీ అధినేత్రి మాయావతి... వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాము సంకీర్ణ ధర్మాన్ని పద్ధతిగా పాటిస్తే... సమాజ్ వాదీ పార్టీ మాత్రం పాటించట్లేదని మాయావతి మండిపడ్డారు. ఇకపై జరిగే ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి బరిలో దిగే ప్రసక్తే ఉండదని మాయావతి తేల్చిచెప్పారు. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. 2012-17 మధ్య ఎస్పీ... దళితులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా... అవన్నీ పక్కన పెట్టి మరీ ఆ పార్టీతో కలిసి పోటీ చేశామని చెప్పిన మాయావతి... ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని విమర్శించారు.


దళితులపై సమాజ్ వాదీ పార్టీ చేస్తున్న అరాచకాలవల్లే, లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, RLD కూటమిని ప్రజలు తిప్పికొట్టారని మాయావతి ఆరోపించారు. ముస్లింలకు అఖిలేష్ టికెట్లు ఇవ్వకపోవడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారామె.

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని 80 స్థానాల్లో ఎస్పీ 5 స్థానాలు గెలుచుకుంటే, బీఎస్పీ 10 చోట్ల విజయం సాధించింది. అప్పటి నుంచీ మాయావతి... అఖిలేష్ యాదవ్‌ను ఉతికారేస్తూనే ఉన్నారు. పరిస్థితి చూస్తే... ఇక ఇప్పట్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు లేవనే అనుకోవచ్చు.ఇవి కూడా చదవండి :

ఏపీ టీడీపీకి మరో షాక్... గుడ్ బై చెబుతున్న అంబికా కృష్ణ

తాచుపాముకి నీరు పట్టించిన అధికారి... వైరల్ అయిన వీడియో...

చైనాలో ప్రారంభమైన ఎల్లో రివర్ మెట్రో లైన్... విశేషాలు ఇవీ...
Published by: Krishna Kumar N
First published: June 24, 2019, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading