మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కే బీఎస్‌పీ మద్దతు

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 116. బీజేపీ 109 స్థానాలు మాత్రమే గెలుచుకోగా, 114 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు రెండు స్థానాలు వెనుకబడింది. బీఎస్‌పీ 2, స్వతంత్రులు 5 స్థానాల్లో గెలిచారు.

news18-telugu
Updated: December 12, 2018, 1:13 PM IST
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కే బీఎస్‌పీ మద్దతు
బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో... మధ్యప్రదేశ్ ఫలితాలు ఉత్కంఠగా కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ మార్క్‌కు రెండు స్థానాలు వెనకబడింది. దీంతో 5 స్థానాలు గెలుచుకున్న స్వతంత్రులతో పాటు 2 స్థానాలు గెలుచుకున్న బీఎస్‌పీ మద్దతు కీలకం కానుంది. ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే... తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌తో పోలిస్తే అన్ని రాష్ట్రాల్లో బీఎస్‌పీ ప్రదర్శన బాగుంది. వారందరికీ నా శుభాకాంక్షలు. మేము ఎట్టిపరిస్థితుల్లో బీజేపీని ఓడించాలనుకున్నాం. అందుకే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు ఉంటుంది.
మాయావతి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 116. బీజేపీ 109 స్థానాలు మాత్రమే గెలుచుకోగా, 114 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు రెండు స్థానాలు వెనుకబడింది. బీఎస్‌పీ 2, స్వతంత్రులు 5 స్థానాల్లో గెలిచారు.
Loading...

ఇవి కూడా చదవండి:

ఆధార్ కార్డు వద్దా? అయితే వెనక్కి తీసుకోవచ్చు...

షావోమీ పోకో ఎఫ్‌1పై రూ.1,000 తగ్గింపు

ఉద్యోగం చేయడానికి ఈ 10 కంపెనీలు బెస్ట్

ఎస్‌బీఐ కస్టమర్లకు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్... ఎలాగో తెలుసుకోండి
First published: December 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...