Home /News /national /

MATHURA TWO DEAD 6 INJURED AMID MASSIVE CROWD DURING JANMASHTAMI CELEBRATIONS AT BANKE BIHARI TEMPLE SK

Krishna Janmashtami: కృష్ణాష్టమి వేళ విషాదం.. మధుర ఆలయంలో ఊపిరాడక ఇద్దరు భక్తులు మృతి

బాంకే బిహారి ఆలయం

బాంకే బిహారి ఆలయం

Krishna Janmashtami: బాంకే బిహారి ఆలయంలో ఏడాదికి మాత్రమే మంగళహారతి జరుగుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజే అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏడాదికోసారి జరిగే మంగళహారతిని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    శ్రీకృష్ణాష్టమి (Krishna Janmashtami) పండగ వేళ శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర (Mathura)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బాంకే బిహారి ఆలయం (Banke Bihari Temple)లో ఊపిరాడక ఇద్దరు భక్తులు మరణించారు. తోపులాటలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బృందావన్‌ (Vrindavan)లోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు. మృతుల్లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదం తర్వాత అక్కడ గందరగోళం వాతావరణం నెలకొంది. భక్తులు భయపడిపోయారు. కానీ ఇప్పుడైతే పరిస్థితి సాధారణంగానే ఉంది.

    Krishnaastami 2022 : శ్రీ కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

    బాంకే బిహారి ఆలయంలో ఏడాదికి మాత్రమే మంగళహారతి జరుగుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజే అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏడాదికోసారి జరిగే మంగళహారతిని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయం సామర్థ్య కంటే అనేక రెట్లు ఎక్కువ మందిపోటెత్తారు. భక్తులు కిక్కిరిసిపోవడంతో కొందరికి శ్వాస ఆడలేదు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ కమిషనర్ ఆలయానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. స్పృహ తప్పి పడిపోయిన భక్తులను ఆలయం నుంచి బయటకు తీసెళ్లారు. అనంతరం వారిని బృందావన్‌లోని రామ కృష్ణ మిషన్, బ్రజ్ హెల్త్ కేర్, సౌ షయా ఆసుపత్రికి తరలించారు. ఐతే వారిలో ఇద్దరు భక్తులు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులను నోయిడాకు చెందిన నిర్మలా దేవి, బృందావన్‌లోని రుక్ముణి విహార్‌కు చెందిన 65 ఏళ్ల రామ్‌ప్రసాద్‌గా గుర్తించారు. రామ్‌ప్రసాద్‌ స్వస్థలం జబల్‌పూర్‌.



    బాంకే బిహారి ఆలయంలో రెండు ఎగ్జిట్ గేట్లు ఉన్నాయి. 1, 4న నెంబర్ల గేట్ల నుంచి భక్తులు బయటకు వెళ్లే మార్గముంది. 4వ నెంబరు గేటు వద్ద ఓ భక్తుడు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని చూసి మిగిలిన భక్తులు ఆందోళన చెందారు. ఎలాగైనా బయటకు వెళ్లిపోవాలని.. లేదంటే ఊపిరాడక చనిపోతామని భయపడ్డారు. చాలా మంది ఒకేసారి గేటు నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆలయం నుంచి బయటకు వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో... భక్తులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. పోలీసులు వచ్చిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. స్పృహతప్పి పడిపోయిన వారిని ఆస్పత్రికి తరలించి.. అనంతరం మిగిలిన భక్తులను క్రమ పద్ధతిలో బయటకు పంపించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత .. గాలి తీసుకొని చాలా మంది ఉపశమనం పొందారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Krishnashtami, Sri Krishna Janmashtami, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు