Fire Accident: నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. Video

నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

 • Share this:
  ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం నోయిడా సెక్టార్ 49లోని బరోలా గ్రామ సమీపంలో మురికివాడలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. మంటలకు గాలి తోడవడంతో వేగంగా వ్యాపిస్తున్నాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో,, చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది.ఈ అగ్ని ప్రమాదంలో పలు గుడిసెలు దగ్దమైనట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. అక్కడి ప్రజలు గుడిసెలల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని అధికారులు తెలిపారు.

  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లలో నోయిడా పోలీసులను కూడా ట్యాగ్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన నోయిడా పోలీసులు.. చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం సంఘటన స్థలానికి చేరుకుందని ట్విట్టర్‌లో వెల్లడించారు.

  గత నెలలలో కూడా నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సెక్టార్‌ 63 సమీపంలో మురికి వాడల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దాదాపు 150కి పైగా గుడిసెలు దగ్దమైనట్లు అధికారులు వెల్లడించారు.
  Published by:Sumanth Kanukula
  First published: