జమ్ములోని అడవిలో కార్చిచ్చు (Forest) రాజుకుంది. నియాకా, పంజ్ గ్రెయిన్, ఘంబీర్ మొఘల్ ప్రాంతాలలో మంటల వ్యాపించాయి. వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సోమవారం రాత్రి ప్రమాదం (Fire accident) జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది, ప్రత్యేక వాహనాలతో ప్రమాదం జరిగిన ప్రదేశంలోనికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Delhi Fire Mishap) జరిగింది.
ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. వీరంతా సజీవ దహనమైనట్లు పేర్కొన్నారు. మరో 40 మంది గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. అర్ధరాత్రి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ రెస్క్యూ సిబ్బంది పలు కార్యాలయాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తీవ్రమైన వేడి ఉండడంతో వారు లోపలికి వెళ్లేకపోయారు. ఇవాళ వేడి తగ్గిన తర్వాత మరోసారి లోపలికి వెళ్లనున్నారు. గదులన్నీ పరిశీలించి.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని చూడనున్నారు. ఆ భవనంలో ఇంకా కొందరు చిక్కుకొని ఉన్నారని స్థానికులు చెప్పారు. మరి వారంతా ఏమయ్యారన్నది తెలియాల్సి ఉంది.
కాగా, ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్ (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి. సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 24 ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఓ వైపు మంటలు అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంలోని కార్యాలయాలలో చిక్కుకున్న పలువురిని కాపాడారు. దాదాపు 70 మందిని కాపాడి భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం మంటల్లో కాలిపోయి మరణించారు. వారి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.