కర్నాటక రాజధాని బెంగళూరు లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాపూజీనగర్ లోని రసాయన కర్మాగారంలో అగ్రి ప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు ఆవరించాయి. నగరంలోని మైసూరు రోడ్డులో గల బాపూజీనగర్ ప్రాంతంలో ఉన్న రసాయన కర్మాగారంలో మంటలు మంగళవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నట్టుండి మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతంలో వ్యాపించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
వివరాలిలా ఉన్నాయి.. బాపూజీనగర్లోని రసాయన కర్మాగారంలో మంగళవారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు కార్మికులు ఉన్నట్టు సమాచారం. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణనష్టమేమి సంభవించలేదని, కానీ నలుగురికి స్వల్ప గాయాలయ్యాయయని అధికారులు చెబుతున్నారు.
కాగా.. మంటలార్పడానికి సుమారు పది ఫైరింజన్లు ఆ ప్రాంతానికి తరలించారు. గత పది రోజుల్లో బెంగళూరులో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. గత నెల 29 న రిచ్మండ్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ లోని ఒక హోటల్ లో వంట గ్యాస్ పేలి.. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన జరిగిన సమయంలో హోటల్ లో సుమారు 60 మంది కస్టమర్లు కూడా ఉన్నారు. దాంతో వారంతా ప్రాణాలరచేతిలో పెట్టుకుని బయటకు పరిగెత్తారు. గతవారం ముంబయికి సమీపంలోని ఓ మాల్ లో మంటలు చెలరేగిన విషయం విదితమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Fire Accident, Karnataka, Mysore