హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video : వ్యర్థాల ప్లాంట్‌ లో భారీ అగ్నిప్రమాదం..వీడియో చూడండి

Video : వ్యర్థాల ప్లాంట్‌ లో భారీ అగ్నిప్రమాదం..వీడియో చూడండి

భారీ అగ్నిప్రమాదం

భారీ అగ్నిప్రమాదం

Massive fire broke out : కేరళలో(Kerala)భారీ అగ్నిప్రమాదం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Massive fire broke out : కేరళలో(Kerala)భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం కొచ్చిలోని బ్రహ్మపురం వ్యర్థాల ప్లాంట్‌(Brahamapuram waste plant)భారీ అగ్నిప్రమాదం జరగడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 5000 లీటర్లకు పైగా నీటితో స్ప్రే చేసినట్లు సదరన్ నేవల్ కమాండ్ తెలిపింది.

ఫైరింజన్లు మాత్రమే కాకుండా నౌకాదళం ALH ద్వారా గాల్లో నుంచి కూడా ఏరియల్ లిక్విడ్ డిసర్బ్సల్ ను ఉపయోగించి మంటలను ఆర్పివేసేందుకు వైమానిక అగ్నిమాపక చర్యలు కూడా జరుగుతున్నాయని సదరన్ నేవల్ కమాండ్ తెలిపింది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే అగ్నిప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున పొగ ఆకాశాన్ని కమ్ముతున్నట్లు ఫొటోలు,వీడియోల్లో కనిపిస్తోంది. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా,ఎంతమందికి గాయాలయ్యాయి అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Daughter married father : తండ్రిని పెళ్లాడిన కూతురు..ఇద్దరు పిల్లల్ని కూడా కనింది!

బ్రహ్మపురంలోని కొచ్చి కార్పొరేషన్‌కు చెందిన ఘన వ్యర్థాల శుద్ధి కర్మాగారంలో 2019 నుంచి ఏటా అగ్నిప్రమాదం జరుగుతూనే ఉంది. వాస్తవానికి, గత ఐదేళ్లలో ప్లాంట్ నుండి కనీసం ఒక పెద్ద అగ్నిప్రమాదం మరియు అనేక రకాల మంటల ఘటనలు నమోదయ్యాయి. మంటలను ఆర్పడానికి మరియు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందికి చాలా రోజుల వరకు పట్టేది. చాలా పెద్ద అగ్నిప్రమాదం.. ఫిబ్రవరి-మార్చి సమయంలో జరగ్గా ప్లాంట్ చుట్టూ ఉన్న భారీగా కమ్ముకున్న పొగతో స్థానిక ప్రజలు రోజుల తరబడి నరకం చూశారు.

First published:

Tags: Fire Accident, Fire broke out, Kerala

ఉత్తమ కథలు