కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..8 మంది రోగులు మృతి

అహ్మదాబాద్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..8 మంది రోగులు మృతి

గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఈరోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు.

  • Share this:
    గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఈరోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు. మ‌రో 35 మందిని ఇత‌ర ఆసుపత్రులకు త‌ర‌లించారు. అహ్మ‌దాబాద్‌లోని న‌వరంగ్‌పురాలో ఉన్న శ్రేయ్ హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. మంటకు కారణం ఇంకా తేలలేదు. సమాచారం ప్రకారం, ఆసుపత్రిలో ఈ అగ్ని ప్రమాదం తెల్లవారుజామున 3:15 గంటలకు జరిగింది. మంటల్లో, అనేక ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి మరియు సాయంత్రం 4:30 గంటల సమయంలో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో 35 మందిని వేరే హాస్పిట‌ళ్ల‌కు త‌ర‌లించారు.

    అహ్మ‌దాబాద్‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో శ్రేయ్ హాస్పిట‌ల్‌ను క‌రోనా ఆసుపత్రిగా మార్చారు. కాగా, అగ్నిప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published: