Home /News /national /

MASSIVE FIRE AT SHOPPING AREA IN MUMBAIS ANDHERI PAH

Fire breaks: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న వాణిజ్య భవనాలు..

పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు

పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు

Mumbai: మంటలు పెద్దఎత్తున వ్యాపిస్తున్నాయి. భారీ ఎత్తున నల్లని పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలో.. స్థానికులు భయంతో పరుగులు పెడుతున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai)  భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంధేరిలో ఉన్న ఓ షాపింగ్ ఏరియాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం నుండి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారాయి. భవనం నుండి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సంఘటనా స్థలంలో ఉన్నారు. అదే విధంగా అక్కడ ముందు జాగ్రత్తగా ప్రజలను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతాలలో అంబులెన్స్ లను తరలించారు.

అధికారుల ప్రకారం.. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదు. సాయంత్రం 4.30 గంటలకు అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెనుక డిఎన్ నగర్ నుండి మంటలు చెలరేగడంతో ఎనిమిది ఐదు ఇంజన్లు, ఐదు జంబో ట్యాంకర్లను సంఘటనా స్థలానికి తరలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అలంకార ఫలకం వద్ద మంటలు చెలరేగాయి. లెవల్-2 అగ్నిప్రమాదానికి (fire accident)  గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కాంప్లెక్స్ చుట్టూ అనేక ఎత్తైన భవనాలు - నివాస మరియు వాణిజ్యపరమైన రెండు భవనాలు ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది వీలైనంత త్వరగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.



ఇదిలా ఉండగ గతంలో హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది.

సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Fire Accident, Mumbai

తదుపరి వార్తలు