లాక్ డౌన్ తర్వాత రైలు ఎక్కాలంటే ఇవన్నీ తప్పనిసరి?

Indian Railways | మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై క్లారిటీ లేదు.

news18-telugu
Updated: April 5, 2020, 7:07 PM IST
లాక్ డౌన్ తర్వాత రైలు ఎక్కాలంటే ఇవన్నీ తప్పనిసరి?
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Indian Railways | కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ప్రధాని మోదీ చెప్పిన లాక్ డౌన్ సమయం ఏప్రిల్ 14తో ముగుస్తుంది. అయితే, ఆ తర్వాతైనా రైళ్లు నడుస్తాయా? లేదా అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రైళ్ళు నడపడంపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, లాక్ డౌన్ తర్వాత ఎప్పుడు రైళ్లు పునఃప్రారంభం అయినా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్‌లు పెట్టుకోమని చెప్పడం, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలని రైల్వే శాఖ ముమ్మరంగా ప్లాన్ చేస్తోంది.

మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై క్లారిటీ లేదు. అయితే, అన్నీ ఒకేసారి కాకుండా, దశలవారీగా నడపొచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ప్రతి రైలు గురించి రైల్వే బోర్డుతో చర్చించి, వారి ఆమోదం తీసుకున్న తర్వాతే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. జోన్ల వారీగా రైల్వే అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading