• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MASK SHOULD BE WEARED WHILE DRIVING ALONE IN A PRIVATE VEHICLE HIGH COURT SAID VS

corona effect ;ఒంటరిగా ఉన్నా.. మాస్క్ ధరించాల్సిందే.. హైకోర్టు వ్యాఖ్యలు

corona effect ;ఒంటరిగా ఉన్నా.. మాస్క్ ధరించాల్సిందే.. హైకోర్టు వ్యాఖ్యలు

corona

Delhi high court ;ఒంటరిగా ఉన్నా.. మాస్క్ ధరించాల్సిందే.. హైకోర్టు వ్యాఖ్యలు కారులో మాస్క్ లేకుండా ఒంటరిగా ప్రయాణిస్తున్న వారికి జరిమానా, జరిమాన విధింపుపై కోర్టులో పిటిషన్ , జరిమానాను సమర్ధించిన ఢిల్లి హైకోర్టు.

  • Share this:
ఒంటరిగా కారులో ప్రయాణించినా మాస్క్ ధరించాల్సిందేనని ఢి్ల్లి హైకోర్టు స్పష్టం చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ ధరిస్తే అభ్యంతరం ఏమిటని పిటిషన్ దారున్ని ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలన్ని పౌరుల భద్రత కోసమేనని వ్యాఖ్యానించింది, కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా టీకా వేసుకున్నా , వేసుకోకపోయినా మాస్క్ ధరించాలని సూచించింది.

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువ అవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే లక్ష మార్క్ దాటిన కరోనాను కట్టడి చేయాలంటే ముందు జాగ్రత్త చర్యలకు ఆయా ప్రభుత్వాలు పునుకున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రభుత్వాలు తీసుకునే చర్యలను కోర్టులు కూడ సమర్ధిస్థున్నాయి. ఈ నేపథ్యంలోనే కారులో ఒంటరిగా వెళుతున్నా మాస్క్ ధరించాలనే కీలక ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు జారీ చేసింది.

కరోనా నివారణకు ఓ వైపు వ్యాక్సిన్ ఇస్తూనే మరోవైపు అది సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే..లాక్డౌన్ విధించడం వల్ల ఆర్ధికంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయని భావించిన ప్రభుత్వాలు మాస్క్ లు ధరించడం పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కరోనా పై కఠిన నిర్ణయాలు తీసుకుంది.ఇప్పటికే రాత్రీ పూట కర్స్యూ విధించింది. మరోవైపు జాగ్రత్త చర్యలపై కూడ చర్యలు చేపట్టింది. మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారిపై జరిమానాలు విధిస్తోంది. ఇలా కారులో
ఒంటరిగా వెళుతున్న వ్యక్తికి జరిమాన విధించింది.

అయితే మాస్క్ ధరించడం పై ఢిల్లికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. పబ్లిక్ స్థలాల్లో అయితే ఓకే.. స్వంత కారులో కూడ ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాలా అంటూ ప్రశ్నించాడు. దీంతో ప్రభుత్వం విధించిన జరిమానపై ఢిల్లి కోర్టును ఆశ్రయించాడు. అయితే.. కోర్టు మాత్రం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు జరిమాన విధించాడాన్ని సమర్ధించింది..

కారులో ప్రయణించేటప్పుడు డోర్ తీసే సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని స్సష్టం చేసింది. కరోనా ఒకరి నుండి మరోకరి వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది.ఇలాంటీ సమయంలో మాస్క్ లేకుంటే కరోనా భారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి ఒకే రకమైన నిబంధలు అవసరం లేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా
నివారణ ఎలాంటీ చర్యలైన తీసుకునే వెసులుబాటు ఉందని తేల్చి చెప్పింది.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు