news18-telugu
Updated: September 4, 2019, 2:43 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడంతో మారుతి సుజుకి సంస్థ గురుగ్రామ్ &మనేసర్‌లోని మాన్యుఫాక్చర్ యూనిట్లను సెప్టెంబర్ 7,9వ తేదీల్లో మూసివేయాలని నిర్ణయించింది. విక్రయాలు లేక మారుతీ సంస్థ ఈ ఏడాది వరుసగా ఏడు నెలలోనూ తమ ప్రొడక్షన్‌ను తగ్గించడం గమనార్హం.అగస్టు నెలలో సంస్థ ప్రొడక్షన్ 33.99%కి పడిపోయింది. గత ఏడాది అగస్టు నెలలో సంస్థ ఉత్పత్తి చేసిన మొత్తం వాహనాలు 1,68,725 కాగా.. ఈ ఏడాది అగస్టులో అది 1,11,370కి పడిపోయింది. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు అందించిన సమాచారంలో మారుతీ ఈ వివరాలు వెల్లడించింది.
మారుతి సంస్థ నుంచి ఆల్టో,న్యూవేగన్ ఆర్,ఇగ్నిస్,స్విఫ్ట్,బలెనో,డిజైర్ కార్ల ఉత్పత్తి ఈ ఏడాది అగస్టు నెలలో 80,909 కాగా.. గత ఏడాది అగస్టు నెలలో 1,22,824 కావడం గమనార్హం. అంటే 34.1శాతం మేర ప్రొడక్షన్ తగ్గిపోయింది.ఇక బ్రెజ్జా,ఎర్తిగా,ఎస్-క్రాస్ వంటి కార్ల ఉత్పత్తి 23,176 నుంచి 15,099కి పడిపోయింది. ఇక సెడాన్-సియజ్ కార్ల ఉత్పత్తి గత ఏడాది అగస్టు నెలలో 2,285 కాగా.. ఈ ఏడాది అగస్టు నెలలో 6,149 కావడం గమనార్హం.
Published by:
Srinivas Mittapalli
First published:
September 4, 2019, 2:43 PM IST