• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • MARRIED WOMAN IN LIVE IN RELATION ALLAHABAD HIGH COURT REJECTS PLEA BY LIVE IN COUPLE SEEKING PROTECTION SU

అలాంటి సహజీవనం చట్ట వ్యతిరేకం.. వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

నా భర్తను వదిలి.. నాకిష్టమైన వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నానని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.

  • Share this:
    నా భర్తను వదిలి.. నాకిష్టమైన వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నానని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడమే కాకుండా.. షాకింగ్ తీర్పును వెలువరించింది. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌కు ఓ వివాహిత, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఇద్దరు కలిసి అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. భర్త, అతని బంధువుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వివాహిత ఆ పిటిషన్‌లో కోరింది. వారు తమ లివ్ ఇన్ రిలేషన్‌లో కలగజేసుకోకుండా ఆదేశాలని ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే మంగళవారం జస్టిస్ కౌషల్ జయేంద్ర ఠాకూర్, జస్టిస్ దినేష్ పాథక్‌లతో కూడిన ధర్మాసనం ఈ రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

    ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వివాహిత మరొక వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కానీ అది చట్టం పరిధిలో ఉండాలని తెలిపింది. సమాజంలో చట్టవ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్‌ను ఎలా అంగీకరించగలమని ప్రశ్నించింది. విచారణ అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, ఆమెకు 5వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.

    TV Actress Arrest: ప్రముఖ టీవీ షోలలో నటిస్తున్న ఇద్దరు నటీమణుల అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక..

    భర్త నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఇబ్బందులుంటే తొలుత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని.. కానీ అలా జరగలేదని వ్యాఖ్యానించింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో వివాహేతర సహజీవనానికి అనుమతించలేమని జస్టిస్ కౌషల్ జయేంద్ర ఠాకూర్, జస్టిస్ దినేష్ పాథక్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: