• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MARCH 12 DATE HAD AN HISTORIC INCIDENT IN INDIAN INDEPENDENCE MOVEMENT MAHATMA GANDHI STARTED DANDI MARCH AGAINST BRITISH RULE HSN GH

Explainer: Dandi march: మార్చి 12.. భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘట్టం.. దండి యాత్ర అసలు ఎలా ప్రారంభమయిందంటే..

Explainer: Dandi march: మార్చి 12.. భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘట్టం.. దండి యాత్ర అసలు ఎలా ప్రారంభమయిందంటే..

మహాత్మా గాంధీ

బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఉప్పు చట్టాలను వ్యతిరేకించారు మహాత్మా గాంధీ.. ఈ దండి మార్చ్ ని దానికి వ్యతిరేకమైన అస్త్రంగా మార్చి ఉప్పు చట్టాలను అతిక్రమించేందుకు నిర్ణయించారు. ఈ యాత్రను చాలా రోజుల ముందు నుంచి ప్లాన్ చేశారు.

  • Share this:
దండి మార్చ్.. ఉప్పు సత్యాగ్రహంగా మనం పిలుచుకునే ఈ నడక మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో ప్రధాన పాత్ర పోషించింది. 1930, మార్చి 12న ప్రారంభమైన ఈ మార్చ్ మన స్వాతంత్రోద్యమాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. మహాత్మా గాంధీ ప్రారంభించిన ఈ ఉద్యమం ఆ తర్వాత శాసనోల్లంఘనోద్యమానికి దారి తీసింది. బ్రిటిష్ వారి మెడలు వంచి స్వాతంత్ర్యం వచ్చేలా చేసింది. ఈ రకంగా చూసుకుంటే మార్చి 12 మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ముఖ్యమైన తేదీగా చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభమైన ఈ నడకలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించేందుకు ముందడుగు వేశారు. ఉప్పు చట్టాలను అతిక్రమిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఆజ్యం పోసేలా చేసిందీ నడక.

బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఉప్పు చట్టాలను వ్యతిరేకించారు మహాత్మా గాంధీ.. ఈ దండి మార్చ్ ని దానికి వ్యతిరేకమైన అస్త్రంగా మార్చి ఉప్పు చట్టాలను అతిక్రమించేందుకు నిర్ణయించారు. ఈ యాత్రను చాలా రోజుల ముందు నుంచి ప్లాన్ చేశారు. నేషనల్ కాంగ్రెస్ లో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలి.. ఏ పనులు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఒకవేళ యాత్రలో పాల్గొనేవారిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేస్తే ఇంకెవరు దాన్ని కొనసాగించాలన్న విషయాన్ని కూడా ముందే నిర్ణయించుకున్నారు. 81 మందితో ఈ యాత్ర ప్రారంభమైనా దీనికి ప్రజల మద్దతు చాలా ఎక్కువగా లభించింది. యాత్ర జరిగినన్ని రోజులూ అందులో ప్రజలు పాల్గొన్నారు. ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా గాంధీజీ ఆయన 79 మంది అనుచరులతో కలిసి 240 మైళ్లు (386 కిలోమీటర్లు) దూరం నడిచారు. ఈ యాత్ర సబర్మతీ ఆశ్రమం దగ్గర మొదలై.. నవ్సారీ జిల్లాలోని దండి అనే ప్రాంతం వరకు కొనసాగింది. తీర ప్రాంతంలోని దండి కి చేరుకొని అక్కడ ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ సముద్రపు నీటిని వేడి చేసి ఉప్పును తయారు చేశారు. ఈ యాత్ర 25 రోజుల పాటు సాగింది. యాత్రలో భాగంగా బాపూజీ రోజూ 16 కిలోమీటర్ల మేర నడిచేవారట. చివరగా దండి ప్రాంతానికి ఏప్రిల్ 6న చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

కాంగ్రెస్ పూర్తి స్వరాజ్యం కోసం సంకల్పం తీసుకున్న తర్వాత ప్రారంభించిన మొట్ట మొదటి పోరాటం కాబట్టి భారత స్వాతంత్ర సంగ్రామంలో దీన్ని చాలా ముఖ్యమైన భాగంగా చెబుతారు. దీనికి ముందు 1920 లో జరిగిన సహాయ నిరాకరణోద్యమం హింసాత్మకంగా మారింది. చౌరీ చౌరా ఘటన తర్వాత అహింసాయుతంగా జరిగిన ఈ దండి మార్చ్ కి ప్రజలు పెద్దఎత్తున సహకారం అందించారు. అత్యధిక సంఖ్యలో ఈ నడకలో పాల్గొన్నారు. ఈ మార్చ్ చివరి అంకంలో చాలా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. కాంగ్రెస్ ఉన్నత స్థాయి లీడర్లందరూ అరెస్టయ్యారు. అయినా సరే.. వారి అనుచరులు, ఇతర ఆందోళన కారులు అహింస మార్గాన్ని మాత్రం వదలలేదు. అమెరికన్ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ ఈ సంఘటన గురించి వివరిస్తూ.. సత్యాగ్రహం చేస్తున్న వారిపై బ్రిటిష్ వారి అణచివేతల గురించి కథనాలు రాసి ప్రపంచానికి దాని గురించి తెలియజేశారు. దీంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా వేలెత్తి చూపింది. వారి పరువు పోయినట్లైంది.
ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..

ఈ ఉద్యమం గాంధీ ఇర్విన్ పాక్ట్ ఏర్పాటుతో పూర్తయింది. ఉప్పు సత్యాగ్రహం తర్వాతే బ్రిటిష్ వారు భారత దేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆలోచించడం కూడా ఈ ఉద్యమం తర్వాత ప్రారంభమైంది. 1935 లో బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాల్లో దీని ప్రస్తావన కూడా మనం చూడొచ్చు. ఈ ఉద్యమంతో శాసనోల్లంఘనోద్యమం విజయవంతం కావడంతో అదే రీతిలో గాంధీజీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. దీని తర్వాతే బ్రిటిష్ వారు మన దేశానికి స్వతంత్రాన్ని అందించి దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరానికి దండి మార్చ్ జరిగి 91 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మరోసారి దండి మార్చ్ ని తలచుకుంటూ దాని స్మారకంగా మరోసారి నడకను కొనసాగించడం ఎంతో ప్రత్యేకంగా మారింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ రోజు ప్రారంభమై 75 వారాల పాటు కొనసాగనుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన దానికి గుర్తుగా 75 వారాలు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
First published: