మావోయిస్టుల అలజడి.. యంత్రాలను తగలబెట్టి..

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహెరి తాలూకా కమలాపూర్-లింగంపల్లి మార్గంలో మవోయిస్టులు విరుచుకుపడ్డారు. అక్కడ వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు యంత్రాలను తగలబెట్టారు.

news18-telugu
Updated: April 9, 2020, 8:35 PM IST
మావోయిస్టుల అలజడి.. యంత్రాలను తగలబెట్టి..
తగలబడుతున్న వాహనాలు
  • Share this:
మావోయిస్టులు ఒక్కసారిగా అలజడి సృష్టించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహెరి తాలూకా కమలాపూర్-లింగంపల్లి మార్గంలో మవోయిస్టులు విరుచుకుపడ్డారు. అక్కడ వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు యంత్రాలను తగలబెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంతమంది గుత్తేదారులు అటవీ ప్రాంతంలో కమలాపూర్-లింగంపల్లి మార్గంలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆ పనుల్లో భాగంగానే వంతెనను నిర్మిస్తున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నారు. వంతెన నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న రెండు ట్రాక్టర్లు, కంకర, సిమెంటు, ఇసుకను కలిపే యంత్రాలకు నిప్పు పెట్టి తగలబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో అలజడి చేలరేగింది.
Published by: Narsimha Badhini
First published: April 9, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading