Home /News /national /

MAOISTS TARGET SECURITY PERSONNEL IN CHHATTISGARH WITH LANDMINE SEVERAL INJURED AK

చత్తీస్‌గఢ్‌లో మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు.. బస్సు పేల్చివేత.. పలువురికి గాయాలు

మావోయిస్టుల దాడిలో గాయపడ్డ భద్రతా సిబ్బంది

మావోయిస్టుల దాడిలో గాయపడ్డ భద్రతా సిబ్బంది

నారాయణ్‌పూర్ జిల్లాలోని బస్తర్ ప్రాంతంలో భద్రతా సిబ్బందితోపాటు పలువురు ఇతర ప్రయాణికులు వెళుతున్న బస్సును మావోయిస్టులు టార్గెట్ చేశారు.

    చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని బస్తర్ ప్రాంతంలో భద్రతా సిబ్బందితోపాటు పలువురు ఇతర ప్రయాణికులు వెళుతున్న బస్సును టార్గెట్ చేశారు. ల్యాండ్ మైన్‌తో బస్సును పేల్చేశారు. ఈ ఘటనలో అనేక మంది భద్రతా సిబ్బంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నారాయణపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ స్పందించారు. ఘటన స్థలానికి మరిన్ని బలగాలను పంపుతున్నట్టు న్యూస్18కు తెలిపారు. భద్రతా సిబ్బందిని తరలించేందుకు రెండు ఎంఐ 17 హెలికాప్టర్లను ఘటన స్థలానికి పంపినట్టు చెప్పారు. గాయపడిన సిబ్బందిని ఈ హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి తీసుకురానున్నామని అన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Maoists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు