Home /News /national /

MAOISTS RELEASED JAWAN RAKESHWAR SINGH WHO KIDNAPPED DURING CHATTISGARH ENCOUNTER PERIOD AK

మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్‌ రాకేశ్వర్ సింగ్ విడుదల

జవాన్ రాకేశ్వర్ సింగ్ (ఫైల్ ఫోటో)

జవాన్ రాకేశ్వర్ సింగ్ (ఫైల్ ఫోటో)

ఎట్టకేలకు జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేశారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదలను ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ధృవీకరించారు.

    చత్తీస్‌గఢ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో బందీగా పట్టుకున్న జవాన్ రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేశారు. దీంతో జవాన్ విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. గత ఐదు రోజులుగా రాకేశ్వర్‌సింగ్‌ మావోయిస్టుల చెరలో ఉండటంతో.. ఆయనను విడిచిపెట్టాలని అంతా కోరుకున్నారు. అయితే ఇందుకోసం కేంద్రం మధ్యవర్తుల ప్రకటించాలని మావోయిస్టులు కోరుతూ వచ్చారు. తమకు పోలీసులతో ఎలాంటి శత్రుత్వం లేదని ప్రకటించారు. నిన్న తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. అయితే మావోయిస్టులు ఎన్ని ప్రకటనలు చేసినా.. వాళ్లు జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను క్షేమంగా విడుదల చేస్తారా ? అనే టెన్షన్ నెలకొంది. అయితే ఎట్టకేలకు జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేశారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదలను ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ధృవీకరించారు. తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు వదిలేశారని... కాసేపట్లో బెటాలియన్‌కు జవాన్‌ చేరుకోనున్నాడని తెలిసింది.

    కొద్దిరోజులక్రితం చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్‌ జిల్లా తారెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ కాల్పుల అనంతరం 23 మంది జవాన్లు నేలకొరగగా.. మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనస్థలంలో రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు తమ ఆధీనంలో బందీగా తీసుకున్నారు. అయితే రాకేశ్వర్ సింగ్‌కు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటు ఆయన కుటుంబం.. ఇటు చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం పలుమార్లు మావోయిస్టులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చాయి. దీంతో మావోయిస్టులు జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Cha, Encounter, Maoists

    తదుపరి వార్తలు