Home /News /national /

MAOISTS RELEASED A LETTER DEMANDS FOR MEDIATOR TO RELEASE CRPF JAWAN VS

Chhattisgarh Encounter: బంధిగా ఉన్న పోలీసు సిబ్బంది విడుదలకు షరతు విధించిన మావోలు

మావోయిస్టుల ఎన్‌కౌంటర్

మావోయిస్టుల ఎన్‌కౌంటర్

బంధిగా ఉన్న పోలీసు సిబ్బంది విడుదలకు షరతు విధించిన మావోలు.. మధ్యవర్తిని ప్రకటిస్తేనే...విడుదల. లేదంటే విడుదల చేయమని ప్రకటన ,చనిపోయిన కుటంభాలకు సంతాపం ,

సంచలనం రేపిన ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ లో బంధిగా సీఆర్పీఎఫ్ సిబ్బంది విడుదలపై మావోయిస్టులు అనతి కాలంలోనే స్పందించారు.  ఛత్తీస్‌గఢ్‌ ఎన్ కౌంటర్ పై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమీటి పేరిట ఓ లేఖను విడుదల చేశారు. ఎన్ కౌంటర్ కు తామే భాద్యులుగా పేర్కోన్నారు. కాగా ఈ ఘటనలో మొత్తం 23 మంది పోలీసులు చనిపోయారని , మరోకరు తమ వద్ద బంధిగా ఉన్నాడని తెలిపారు. కాగా పోలీసులు దాడిలో నలుగురు మావోయిస్టులు కూడ ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

అయితే మావోయిస్టుల వద్ద బంధీగా ఉన్న పోలీసును విడుదల చేసేందుకు అంగీకరించారు. అందుకోసం ప్రభుత్వానికి ఓ షరతు విధించారు. ఎవరైన మధ్యవర్తి ద్వారనే బంధిగా ఉన్న పోలీసును విడుదల చేస్తామని పేర్కోన్నారు. అప్పటివరకు తమ వందే ఉంటాడని స్పష్టం చేశారు. మధ్యవర్థి పేరు ప్రకటించే వరకు బంధిగా ఉన్న పోలీసు తమ వద్దే క్షేమంగా ఉంటాడని తెలిపారు. మరోవైపు చనిపోయిన పోలీసుల కుటంభాలకు సంతాపం తెలియ చేస్తున్నట్టు లేఖలో పేర్కోన్నారు. పోలీసులు మాకు శత్రువులు కాదని అన్నారు.

కాగా కేంద్ర హోమంత్రి అమిత్ షా నాయకత్వంలోని మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు తమపై దాడికి కుట్ర పన్నుతున్నారని లేఖలో పేర్కోన్నారు. తాజా ఎన్ కౌంటర్ లో సుమారు 2000 మంది పోలీసులు మావోయిస్టులపై దాడికి వచ్చినట్టు పేర్కోన్నారు. ప్రభుత్వాలతో తాము ఎప్పుడు చర్చలకు సిద్దమేనని కాని ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ప్రకటించారు. కాగా తమ పోరాటం ఎప్పుడు ప్రభుత్వంతోనని పోలీసులతో కాదని స్పష్టం చేశారు.

బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శనివారం పెద్ద సంఖ్యలో వెళ్లారు. దీంతో మావోయిస్టులు ఎదురుపడడంతో సుమారు మూడు గంటలపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

ఇక ఈ ఎన్ కౌంటర్లో మొదటగా ఐదుగురు జవాన్లు ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మరో 17 మంది జవాన్ల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం మీద 22 మంది జవాన్లు ఈ ఘటనలో మరణించారని అధికారికంగా వెల్లడించారు. గాయపడిన వారికి బీజాపూర్, రాయ్ పూర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా ఒక భద్రతా సిబ్బంది మావోయిస్టులకు పట్టుబడ్డారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Amit Shah, Chatisghad, L, Maoist attack

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు