(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, న్యూస్ 18 తెలుగు)
చర్చలకు వచ్చే మధ్యవర్తుల పేర్లను ముందుగా వెల్లడిస్తేనే తమ ఆధీనంలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను విడుదల చేస్తామంటూ మావోయిస్టులు చేసిన ప్రకటనపై ఇప్పటిదాకా ఓ స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించని చత్తీస్ఘడ్ సర్కారుకు మావోయిస్టులు మరో ఆధారాన్ని పంపారు. Rakeshwar Singh Manhasను రెండు రోజుల క్రితం చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్ జిల్లా తారెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ కాల్పుల అనంతరం 23 మంది జవాన్లు నేలకొరగగా.. మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ Rakeshwar Singh Manhasను మావోయిస్టులు తమ ఆధీనంలో బందీగా ఉంచారు. అయితే రాకేశ్వర్ సింగ్ కు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటు ఆయన కుటుంబం.. ఇటు చత్తీస్ఘడ్ ప్రభుత్వం పలుమార్లు మావోయిస్టులకు విజ్నప్తులు చేస్తూ వచ్చాయి. అయితే ఆచూకీ లేకుండా పోయిన రాకేశ్వర్ సింగ్ విషయంలో పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఓ స్పష్టమైన అంచనా లేకుండా పోయింది.
పోలీసుల వైపున భారీ ప్రాణ నష్టాన్ని కలుగజేసిన మావోయిస్టు యాక్షన్ దళానికి నేతృత్వం వహిస్తున్న మడవి హిడ్మా వ్యూహంలో భాగంగానే ఇలా జవాన్‌ను బందీగా పట్టుకుని మరోసారి మారణహోమానికి ఎత్తుగడ వేస్తున్నారన్న అనుమానం పోలీసు ఉన్నతాధికారుల్లో కలుగుతోంది. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా మావోయిస్టుల మాటలు ఎలా నమ్మాలన్న దానిపై నిన్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ లేఖను విడుదల చేశారు. అయినా పోలీసు ఉన్నతాధికారుల్లోనూ, అటు ప్రభుత్వాధినేతలలోనూ అనుమానాలు తొలగిపోలేదు.పోలీసు కానిస్టేబుల్ Rakeshwar Singh Manhas ను తమ అదుపులోనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తూ మావోయిస్టులు బుధవారం నాడు ఓ ఫోటోను విడుదల చేశారు. తాటాకు పాకలో కూర్చొని ఏదో విషయంపై సీరియస్‌గా మాట్లాడుతున్నట్టుగా ఉన్న రాకేశ్వర్‌సింగ్ ఫోటోను Maoists మీడియాకు విడుదల చేశారు. దీంతో ఇక అనుమానాలకు తెరదించి.. రాజేశ్వర్సింగ్ను విడిపించాల్సిన పనిలో పోలీసు ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.
అయితే ఇప్పటికే మావోయిస్టుల వైపు నుంచి డిమాండ్లతో కూడిన లేఖ రావడం తెలిసిందే. పొట్టకూటి కోసం పనిచేసే పోలీసులు తమకు శత్రువులు కాదని.. కేంద్ర రాష్ట్రాలు చేపట్టిన ఆపరేషన్ ప్రహార్‌ను నిలిపివేయాలని.. మధ్యవర్తుల పేర్లను ముందుగా వెల్లడించాలని స్పష్టం చేశారు. అప్పటిదాకా జవాను రాకేశ్వర్‌సింగ్ జనతన సర్కారు అదుపులోనే ఉంటాడని పేర్కొన్నారు. మావోయిస్టులను ఎదుర్కొనే క్రమంలో సామాన్యులను చంపుతున్నారని, దాన్ని వెంటనే నిలిపివేయాలని వికల్ప్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తమ ప్రకటనల విషయంలో తలెత్తుతున్న అనుమానాలకు తెరదించే క్రమంలోనే జవాన్ Rakeshwar Singh Manhasఫొటోను విడుదల చేసినట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయితే మావోయిస్టులు విడుదల చేసిన ఫోటోను విశ్లేషిస్తే.. రాకేశ్వర్‌సింగ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బందీగా దొరికిన వారిని మరిన్ని విలువైన రహస్యాల కోసం చిత్రవధ చేస్తారన్న ప్రచారాలు.. ఊహాగానాలపై దీంతో క్లారిటీ వచ్చినట్లయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Jawan photo release, Maoist, Maoist attack, Maoist fire, Telangana