పేలుడుకి 12 గంటల ముందే అమర్చిన బాంబు అది... గడ్చిరోలి దాడిపై షాకింగ్ నిజాలు...

Gadchiroli Attack : జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బాంబు ఉన్న చోటికి రాగానే... ఇద్దరు మావోయిస్టులూ కలిసి... 100 మీటర్ల దూరం నుంచీ... కమాండ్ వైర్ ఉపయోగించి... IEDని పేల్చివేశారని నిఘా వర్గాలు తెలిపాయి. అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ వాడి బాంబును తయారుచేశారని తేల్చాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 10, 2019, 2:32 PM IST
పేలుడుకి 12 గంటల ముందే అమర్చిన బాంబు అది... గడ్చిరోలి దాడిపై షాకింగ్ నిజాలు...
మరోవైపు తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటుచేసిన మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ ఆవు చనిపోయింది.
  • Share this:
మే 1న మధ్యాహ్నం 12.30కి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో రోడ్డుపై మావోయిస్టులు జరిపిన దాడిని మనం ఇంకా మర్చిపోలేదు. శక్తిమంతమైన IED (Improvised Explosive Device)ని పేల్చడం వల్ల ఏకంగా 15 మంది జవాన్లు, ఓ డ్రైవరూ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లంతా ప్రయాణించిన ప్రైవేట్ వాహనం పేలుడు దాటికి ముక్కలై చెల్లా చెదురైంది. ఏడాది కిందట తమపై జరిపిన దాడికి ప్రతీకారంగానే ఈ దాడి చేశామని మావోయిస్టులు ప్రకటించారు. ఐతే... ఈ ఘాతుకానికి సంబంధించి మరో కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ దారిలో తమ వాహనం వస్తుందని తెలిసి... అప్పటికప్పుడు మావోయిస్టులు బాంబును అమర్చారని ఇన్ని రోజులూ భద్రతా బలగాలు భావించాయి. కానీ... దాడికి 12 గంటల ముందే ఇద్దరు మావోయిస్టులు కలిసి ఆ బాంబును అమర్చారని తాజాగా తెలిసింది.

gadchiroli,ied blast by maoists in gadchiroli,ied blast gadchiroli,gadchiroli ied blast,ied blast,gadchiroli news,gadchiroli blast,maoist attack,maoists exploded ied in maharashtra gadchiroli,maoists,blast in gadchiroli,maoists in gadchiroli,gadchiroli alert,maoist attack in gadchiroli,gadchiroli maharashtra,gadchiroli naxal attack,ied explosion in gadchiroli,ied explosion by extremists in gadchiroli, మావోయిస్టులు, గడ్చిరోలి, దాడి, శక్తిమంతమైన పేలుడు, 15 మంది జవాన్లు మృతి, మావోయిస్టుల దాడి,
ఐఈడీని పేల్చిన మావోయిస్టులు (File)


జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బాంబు ఉన్న చోటికి రాగానే... ఇద్దరు మావోయిస్టులూ కలిసి... 100 మీటర్ల దూరం నుంచీ... కమాండ్ వైర్ ఉపయోగించి... IEDని పేల్చివేశారని నిఘా వర్గాలు తెలిపాయి. అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ వాడి బాంబును తయారుచేశారని తేల్చాయి.

బుధవారం మధ్యాహ్నం పేలుడు జరిగితే... మంగళవారం రాత్రి నుంచే మావోయిస్టులు ఆ ప్రదేశంలో ఉన్నట్లుగా నిఘావర్గాల దర్యాప్తులో తేలింది.

ఇదివరకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఇలాంటి చాలా దాడులకు పాల్పడ్డారు. అంతకు ముందు రోజే... ఆ ఏరియాలో 32 కన్‌స్ట్రక్షన్ వాహనాల్ని తగలబెట్టారు. తద్వారా భద్రతా బలగాలు ఆ రోడ్డు వైపు వచ్చేలా చేశారు.

ఐతే... మే 1న పేలుడు జరిపిన రోడ్డుపై 1996 నుంచీ ఇప్పటివరకూ మావోయిస్టులు ఏ దాడులూ చెయ్యలేదు. అందువల్ల భద్రతా బలగాలు అటువైపు వచ్చాయి. మావోయిస్టుల నుంచీ తప్పించుకునేందుకు సొంత వాహనంలో కాకుండా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చినప్పటికీ... దాడి నుంచీ తప్పించుకోలేకపోయారు జవాన్లు.

దాడి చేసేందుకు ఎన్ని గంటలైనా ఎదురుచూడాలనుకున్న మావోయిస్టులు అందుకు తగ్గట్టుగానే ఎక్కువ మొత్తంలో వాటర్ బాటిళ్లు, ఆహారాన్ని తెచ్చుకున్నారని తెలిసింది. దాడికి 45 నిమిషాల ముందు ఆదే రోడ్డుపై ఓ పోలీస్ వాహనం వెళ్లింది. అందులో ఉన్నది పోలీసులని తెలియడంతో మావోయిస్టులు దాన్ని పేల్చలేదని తెలిసింది. 

ఇవి కూడా చదవండి :

అది తోడేలు కాదు కుక్క... జూ అధికారులపై పర్యాటకుల ఫైర్... అసలు విషయమేంటంటే...

స్టోన్‌హెంజ్ మిస్టరీ వీడబోతోందా... మిస్సింగ్ అయిన రాయి ఏం చెబుతోంది...


వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం


ఉండవల్లికి గాలం వేస్తున్న టీడీపీ... వైసీపీ వదులుతుందా... ?
First published: May 10, 2019, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading