Home /News /national /

MAOISTS KILLED THEIR OWN COMMANDER VIJA MODEM ALIAS BHADRU FOR MURDERING TRIBALS BA KMM

Maoist kills Commander: సొంత కమాండర్‌ను చంపిన మావోయిస్టులు

విజా మోడియం అలియాస్ బద్రు (File)

విజా మోడియం అలియాస్ బద్రు (File)

డీవీసీ ఇన్‌ఛార్జి గంగళూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు (34) ను మావోయిస్టు సహచరులు హత్య చేశారు.

    సొంత ఎజెండాతో గ్రామస్తులను చంపాడనే అభియోగంతో ఏకంగా తమ సొంత కమాండర్‌ను హత్య చేశారు మావోయిస్టులు. డీవీసీ ఇన్‌ఛార్జి గంగళూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు (34) ను హత్య చేశారు. బీజాపూర్‌లో ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామస్తులను మావోయిస్టులు హత్యలు చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో మావోయిస్టు అధిష్టానం దండకారణ్యం జోన్ ముఖ్యనేతలు సీరియస్ గా తీసుకున్నారు. హత్యల ఘటనల వెనుక పూర్వాపరాలు శోధించి ప్రజా కోర్టు నిర్వహించి అనంతరం స్థానిక డివిజన్ ఏరియా కమిటీ ఇంచార్జీ, కమాండర్ విజా మోడియం అలియాస్ బద్రును దోషిగా నిర్ధారించింది. గ్రామస్తుల హత్యలు ఉద్దేశపూర్వకంగా బద్రు ఏకపక్షంగా స్వంత నిర్ణయాలు తీసుకుని తనకు వ్యతిరేకంగా వున్న వారిని చంపాడనే అబియోగంతో మావోయిస్టులు తమ సొంత కమాండర్‌నే హత్యచేసిన ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు నాయకుడు, డీవీసీ ఇన్‌ఛార్జి గంగళూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు (34) బీజాపూర్ జిల్లా గంగలూర్ సమీపంలోని మంకేలి గ్రామస్తుడు. గురువారం అతడిని హత్య చేసిన మావోయిస్టులు అనంతరం మృతదేహాన్ని అర్థరాత్రి కుటుంబానికి అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా పేరు గాంచిన విజాను గంగళూరు - కిరాండుల్ మధ్య ఎటావర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు హత్య చేసినట్టు తెలిసింది. అనంతరం సొంత గ్రామం మాన్‌కెలిలో మావోయిస్టు కమాండర్ విజా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూర్తి చేసినట్లు సమాచారం.

    ఛత్తీస్‌గఢ్‌‌లోని బస్తర్ డివిజన్‌లో ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను చంపేశారు. తాజాగా కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్య‌క్తుల‌ను మావోయిస్టులు దారుణంగా హ‌త‌మార్చారు. మ‌రికొంత‌ మంది గ్రామ‌స్తుల‌ను కూడా నాలుగు రోజుల క్రితం మావోలు హ‌త్య చేశార‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో బస్తర్ అడవుల్లోని గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్యాయంగా తమ వారిని పొట్టన బెట్టుకున్నారని రోదిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే సెప్టెంబ‌ర్ 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని అతి కిరాతకంగా గొంతుకోసి హతమార్చారు. దట్టమైన అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు విధించారు. నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్ధారిస్తూ.. కాళ్లుచేతులు కట్టేసి, గొంతుకోసి హత్య చేశారు. తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చే వారిందరికీ ఇదే గతి పడుతుందని గట్టిగా హెచ్చరించారు. మరో ఐదు మందిని తీవ్రంగా గాయపరిచి వదిలిపెట్టారు మావోయిస్టులు. వారు గ్రామాలకు చేరుకొని జరిగిన విషయం చెప్పడంతో.. మావోయిస్టుల ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

    ఇక సెప్టెంబర్ 23వ తేదీన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సెప్టెంబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడ్డారని, పోలీసులపై కాల్పులు జరపడంతో తాము ఎదురుకాల్పులు చేశామని పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి 01 పిస్టల్, ఒక 8ఎంఎం రైఫిల్, బ్లాస్టింగ్ సామాగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Khammam, Maoists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు