కానిస్టేబుల్‌ను హత్యచేసిన మావోయిస్టులు.. మహిళలపై అత్యాచారం చేశాడని..

ప్రజల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తుండడం, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని మావోయిస్టులు రమేశ్‌ను కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

news18-telugu
Updated: April 17, 2020, 1:58 PM IST
కానిస్టేబుల్‌ను హత్యచేసిన మావోయిస్టులు.. మహిళలపై అత్యాచారం చేశాడని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ఎస్పీఓ కానిస్టేబుల్‌ను మవోయిస్టులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ ఫర్సేగఢ్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీజాపూర్ జిల్లా డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వుడ్ గార్డు) పరిధిలో కుర్సం రమేశ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తుండడం, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని మావోయిస్టులు రమేశ్‌ను కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మావోయిస్టు నేషనల్ పార్కు ఏరియా కమిటీ పేరుతో ఘటనా స్థలంలో లేఖను వదిలిపెట్టారు. కానిస్టేబుల్‌ను కత్తులతో నరికి హత్య చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Published by: Narsimha Badhini
First published: April 17, 2020, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading