మావోయిస్టుల బీభత్సం.. 25 మందిని కిడ్నాప్ చేసి.. గొంతుకోసి చంపేసి..

నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్ధారిస్తూ.. కాళ్లుచేతులు కట్టేసి, గొంతుకోసి హత్య చేశారు. తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చే వారిందరికీ ఇదే గతి పడుతుందని గట్టిగా హెచ్చరించారు. మరో ఐదు మందిని తీవ్రంగా గాయపరిచి వదిలిపెట్టారు.

news18-telugu
Updated: September 6, 2020, 8:48 PM IST
మావోయిస్టుల బీభత్సం.. 25 మందిని కిడ్నాప్ చేసి.. గొంతుకోసి చంపేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నెత్తుటేరులు పారాయి. బస్తర్ డివిజన్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని అతి కిరాతకంగా గొంతుకోసి హతమార్చారు. మరో ఐదుగురిని తీవ్రంగా కొట్టి విడిచిపెట్టారు. మిగిలిన 16 మంది ఇప్పటికే మావోయిస్టు చెరలోనే ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న కారణంతో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు మావోయిస్టులు.

రెండు గ్రామాలకు చెందిన చెందిన 25 మంది గిరిజనులను మూడు రోజుల కిందట కిడ్నాప్ చేశారు. దట్టమైన అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు విధించారు. నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్ధారిస్తూ.. కాళ్లుచేతులు కట్టేసి, గొంతుకోసి హత్య చేశారు. తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చే వారిందరికీ ఇదే గతి పడుతుందని గట్టిగా హెచ్చరించారు. మరో ఐదు మందిని తీవ్రంగా గాయపరిచి వదిలిపెట్టారు. వారు గ్రామాలకు చేరుకొని జరిగిన విషయం చెప్పడంతో.. మావోయిస్టుల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. మావోల చెరలో ఉన్న మిగతా 16 మందిని విడిచిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐతే నలుగురిని చంపేయడంతో ఆ రెండు గ్రామాల ప్రజల్లో తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.

మరోవైపు తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. సెప్టెంబరు 3న భద్రాద్రిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత హరిభూషణ్‌ గన్‌మన్, యాక్షన్‌ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ హతమవడంతో మావోయిస్టులు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతీకారం కోసం మావోలు ఎదురుచూస్తుండడంతో ఎప్పుడేం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి కూంబింగ్‌ను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో.. ఏదో జరగబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 6, 2020, 8:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading