హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఏవోబీలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోయిస్టులు.. ఓ జవాన్‌కు గాయాలు

ఏవోబీలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోయిస్టులు.. ఓ జవాన్‌కు గాయాలు

ఏవోబీలో మావోయిస్టులు లాండ్‌మైన్ పేల్చడంతో గాయపడిన జవాన్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

ఏవోబీలో మావోయిస్టులు లాండ్‌మైన్ పేల్చడంతో గాయపడిన జవాన్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

ఆంధ్ర ఒడిశా బోర్డర్‌లో కూంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ ఎఫ్ బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం రాయపూర్ తరలించారు.

ఆంధ్ర ఒడిశా బోర్డర్‌లో కూంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ ఎఫ్ బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం రాయపూర్ తరలించారు. ఏవోబీ లో గల మల్కన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాల్ దాలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ఆ ప్రాంతానికి కూంబింగ్ చేసుకుంటూ వెళ్లగా మావోయిస్టులు లాండ్ మైన్ పేల్చారు. వెంటనే తేరుకున్న జవాన్లు మావోయిస్టుల పై ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ తప్పిచుకున్నారు. మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చిన ఘటన లో బీఎస్ఎఫ్ 160 బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు గాయపడ్డారు. వెంటనే బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం ఛత్తీస్‌గఢ్ లో గల రాయపూర్ కు తరలించారు. తప్పిచుకున్న మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టారు.

పోలీసులను మట్టుబెట్టడమే పనిగా పెట్టుకున్న మావోయిస్టులు తమకున్న పరిమిత వనరులతో బుర్రకు పనిచెబుతున్నారు. తమను వేటాడడానికి వచ్చే పోలీసులే లక్ష్యంగా బూబీ ట్రాప్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. రాళ్లు, రప్పలు, చెట్టు చేమ నిండి ఉండే అటవీ ప్రాంతంలో నడక మార్గానికి అనువుగా ఉండే ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేస్తారు. నాలుగు నుంచి ఐదడుగుల పొడవు, వెడల్పున, రెండుడుగుల లోతులో.. ఓ పెద్ద చెక్కకు అమర్చిన పదునైన ఇనుప చువ్వలను పరుస్తారు. గుర్తించడానికి వీల్లేకుండా తేలికపాటి కర్రలు, పెద్ద పెద్ద ఆకులు కప్పుతారు. పరీక్షగా చూస్తేగానీ గుర్తించలేనంత జాగ్రత్తగా వీటిని పెడతారు. ఇక వాళ్లు కాకుండా వేరైవరైనా ఆ మార్గంలో వెళ్లాల్సి వచ్చినపుడు తప్పనిసరిగా అక్కడ కాలు వేయాల్సిందే. పొరపాటున వేశారో చురకత్తుల్లాంటి పదునైన ఇనుప మేకులు శరీరంలోకి దిగినట్టే. ఇలా ఈ గోతిలో పడి తేరుకుని లేచేలోపుగానే ఎదురుదాడి మొదలవుతుంది.

అతి పురాతనమైన ఈ పోరాటవిద్యను మావోయిస్టులు తమకు రక్షణగా ఈ మధ్యకాలంలో విస్త్రుతంగా అమలు చేస్తున్నారు. శత్రువు కోలుకునేలోగా దాడి చేయొచ్చు. విపరీతంగా ప్రాణనష్టాన్ని కలుగజేయొచ్చన్నది ఇక్కడి వ్యూహం. ఇలా ఒకచోట బూబీట్రాప్‌.. మరోచోట ల్యాండ్‌ మైన్‌.. కాలు తీసి కాలు పెట్టాలంటే హడలి పోయేటంతటి స్థాయిలో భూమినే ఆయుధ క్షేత్రంగా మలచుకోవడంలో మావోయిస్టులు ఆరితేరిపోయారు. ఇది మావోయిస్టుల వేటకు వెళ్లే కూంబింగ్‌ బృందాల పాలిట శాపంగా పరిణమించింది. ఇలా ఈ ట్రప్స్‌లో పడి తీవ్రంగ గాయపడిన వాళ్ల సంఖ్య లెక్కలేనిది. ఎంతో అనుభవం ఉన్న కమాండర్‌ కనుసన్నల్లో జరిగే ఆపరేషన్లో మాత్రమే వీటి బారిన పడకుండా ముందుకు వెళ్లగలిగే వీలుంటుంది.

First published:

Tags: Andhra Pradesh, CRPF, Maoist attack, Maoists, Odisha