Home /News /national /

MAOIST CENTRAL COMMITTEE CLARIFIES ON GANAPATI SURRENDER NEWS AK

గణపతి లొంగుబాటు.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ

మావోయిస్టు అగ్రనేత గణపతి (File - credit - twitter)

మావోయిస్టు అగ్రనేత గణపతి (File - credit - twitter)

గణపతి అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు.

    మావోయిస్టు అగ్రనేత గణపతి పోలీసులకు లొంగపోనున్నానని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథ అని మావోయిస్టు పార్టీ కొట్టిపారేసింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రెండు పేజీల లేఖ విడుదల చేశారు. గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ అని లేఖలో పేర్కొన్నారు. ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని ఆరోపించారు. గణపతి అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం గణపతి లొంగుబాటుకు సంబంధించి జరుగుతున్న ప్రచారమంతా తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలు అని లేఖలో ఆరోపించారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం ధృడంతా ఉందని అన్నారు. తమ నాయకత్వపు ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కట్టు కథలు పుట్టిస్తున్నారని ఆరోపించారు.

    అంతకుముందు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం గణపతి లొంగుబాటు వార్తలు మరింత ఊతమిచ్చింది. గణపతి లొంగుబాటు ఖాయమైందని... అందుకే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరిగింది. గణపతితో పాటు మరికొందరు మావోయిస్టు నేతలు కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు కొద్దిరోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో గణపతి లొంగుబాటు వార్తలపై క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ.. ఈ వార్తలకు చెక్ చెప్పింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ganapathi, Maoists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు