హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారత్‌ నుంచి ప్రపంచ దేశాలు చాలా నేర్చుకోవాలి.. న్యూస్18 ఇంటర్వ్యూలో మిలిందా గేట్స్‌

భారత్‌ నుంచి ప్రపంచ దేశాలు చాలా నేర్చుకోవాలి.. న్యూస్18 ఇంటర్వ్యూలో మిలిందా గేట్స్‌

మిలిందా గేట్స్

మిలిందా గేట్స్

Melinda Gates: భారతదేశ వృద్ధి, ప్యాండమిక్‌ మేనేజ్‌మెంట్, టీకా వ్యాక్సినేషన్‌ మోడల్, G20 స్ట్రాటజీపై గేట్స్ ఫౌండేషన్ మిలిందా గేట్స్‌తో CNN News18 ఆనంద్ నర్సింహన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలు ఇవే..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా విపత్తు (Coronavirus), ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పుల నడుమ G20 కూటమికి భారతదేశం నాయకత్వ బాధ్యతలు స్వీకరించింది. 2023 సెప్టెంబర్‌ 9, 10వ తేదీల్లో న్యూఢిల్లీ (New Delhi) G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ దేశాలను ముందుండి నడిపించేందుకు సిద్ధమైన భారత్‌.. G20 స్ట్రాటజీలపై చర్చించేందుకు ఇటీవల అఖిళ పక్ష భేటీని కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా ఇండియా పర్యటనలో ఉన్న గేట్స్ ఫౌండేషన్ మిలిందా గేట్స్‌తో భారతదేశ వృద్ధి, ప్యాండమిక్‌ మేనేజ్‌మెంట్ & టీకా వ్యాక్సినేషన్‌ మోడల్, G20 స్ట్రాటజీపై CNN News18  ఆనంద్ నర్సింహన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలు ఇవే..

* ఆనంద్ - మీరు చివరిసారిగా ఇండియాను సందర్శించి 7 సంవత్సరాలు అవుతోంది? ఏం మార్పులు గమనించారు?

మిలిందా- భారతదేశం చాలా మారిపోయింది. డిజిటల్ పరంగా వచ్చిన మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రంగంలో జరిగిన అభివృద్ధి పనులపై నాకు అవగాహన ఉంది. ఈ చర్యలు ప్రజల జీవితాలను మారుస్తున్నాయి. ఇప్పుడు వారు డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్‌ ఓపెన్‌ చేసుకోవచ్చు.. ఇప్పటి వరకు ఇలా 470 మిలియన్ బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ అయ్యాయి. వాటిలో సగం మహిళలకు చెందినవి ఉన్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రాసెస్‌ను డిజిటలైజ్‌ చేయడం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. చాలా మందికి ఉపయోగపడింది.

* ఆనంద్- 7 సంవత్సరాలలో ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం మీకు ఆశ్చర్యంగా ఉందా?

మిలిందా- ఈ అభివృద్ధి ఎంత త్వరగా మొదలైందనే దాని వెనుక ఉన్న రెగ్యులేషన్స్‌ నాకు తెలుసు. ఈ స్థాయి మార్పులకు కొవిడ్‌ కూడా ఒక కారణమని భావిస్తాను. అది సానుకూల ఫలితాన్ని ఇచ్చింది.

* ఆనంద్ - మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ప్రవేశించాలని 2016లో మీరు చెప్పారు. ఇటీవలి గోల్‌కీపర్స్‌ నివేదిక కూడా కేవలం మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా వారికి మరింత శక్తిని అందించడం గురించి మాట్లాడింది. దీనిపై మీ ఆలోచన ఏంటి?

మిలిందా- అన్ని స్థాయిలలో అధికారంలో మహిళలు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్స్, రాజకీయాలు, మీడియాలో ఆ స్థాయిలో మహిళలు లేరు. నేను చెప్పినట్లు మహిళలకు సాధికారత కల్పించే బదులు వారిని ఫుల్‌ పవర్‌లోకి తీసుకురావాలి. మహిళలకు మంచి ఉద్యోగం ఉంటే సరిపోదు. ఆమెకు పిల్లల సంరక్షణ బాధ్యతలు ఉంటే పనిలో కూడా ఎక్కువ గంటలు ఉండలేరు. బ్యాంక్‌ అకౌంట్‌, ఆస్తులు కూడా స్త్రీల పేరు మీద ఉండవు. వారికి పూర్తి అధికారం లేదు. కాబట్టి మనం స్త్రీల చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించాలని భావిస్తున్నాను.

SBI News: ఎస్‌బీఐ న్యూ ఇయర్ ఆఫర్ అదిరింది.. ఏకంగా రూ. 40 వేల డిస్కౌంట్!

* ఆనంద్- దీన్ని సాధించడం సులభమా? కష్టమా? ఎంత?

మిలిందా- పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సమాజాలలో దానిని సాధించడం సులభం. భారతదేశంలో ప్రధానమంత్రి నుంచి వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వరకు ఉన్న నిబద్ధత నన్ను ఆకట్టుకుంది. ప్రధాని మోదీ స్త్రీల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ వారితో రాత్రి నేను ఉన్నాను. అన్ని మంత్రిత్వ శాఖలు తమ ప్రోగ్రామ్స్‌లోకి జెండర్‌ పాలసీ తీసుకురావడం గురించి విన్నాను. ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని తెలుసుకున్నాను.

* ఆనంద్- ఇక్కడ ఫౌండేషన్ చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. మీరు వెళ్లి వాటిని చూడాలని ఆసక్తిగా ఉన్నారా?

మిలిందా- నేను రేపు యూపీకి వెళ్లి చాలా హెల్త్‌ సిస్టమ్‌లను పరిశీలిస్తాను. నిన్న నేను సౌత్‌ ఢిల్లీ కమ్యూనిటీలో ఉన్నాను. అక్కడ ట్రాన్స్‌ఫర్‌ పేమెంట్‌ సిస్టమ్‌, పోస్టల్ సిస్టమ్‌ చూశాను. కమ్యూనిటీలో మహిళలు బయటకు వచ్చి ఇతర మహిళలను కలుస్తున్నారు. 14 మంది మహిళలతో నేను మాట్లాడాను. వారందరికీ డిజిటల్‌ బ్యాంక్ అకౌంట్స్‌ ఉన్నాయి. వారికి ఇప్పుడు డబ్బు ఉండటం ఎలా అనిపిస్తోందని అడిగాను. చుట్టూ ఉన్న వ్యక్తులు డబ్బు లేకపోతే ఎంత తక్కువగా చూస్తారనే దాని గురించి వాళ్లంతా మాట్లాడారు. ప్రతి మహిళలకు డిజిటల్ బ్యాంక్ అకౌంట్‌ ఉండేలా మహిళా ఏజెన్సీలు చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

* ఆనంద్ - ఆర్థిక సమ్మేళనం అంత పెద్ద మార్పుని కలిగిస్తుందా? ప్రభుత్వం సరైన దిశలో పని చేస్తుందా? భారతదేశం నుంచి ఇతర దేశాలు ఏం నేర్చుకోవచ్చని మీరు అనుకుంటున్నారు?

మిలిందా- ఈ సంవత్సరం భారతదేశం G-20కి ఆతిథ్యం ఇవ్వనున్న సందర్భం కోసం ఎదురుచూస్తున్నాను. రెండు జెండర్‌లకు బ్యాంకు అకౌంట్‌ ఉండేలా డిజిటలైజేషన్‌ తీసుకొచ్చిన ఇండియా సరైన దిశలో ప్రయాణిస్తోంది. దీంతో మహళలు రుణాలు పొందవచ్చు, పనులు చేసుకోవచ్చు, డబ్బును ఆదా చేసుకోవచ్చు. చాలా మంది మహిళలు పిల్లల చదువు గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి మార్పులతోనే దేశం పురోగతి సాధిస్తుంది. భారత్‌ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.

* ఆనంద్- అది ఆవిష్కరణల దిశగా మహిళలను నడిపిస్తుందా? వారిలో చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందా?

మిలిందా- ప్రభుత్వం మహిళా నేతృత్వంలోని వ్యాపారాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రుణాలు అందిస్తోంది. నేను ఇప్పుడే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఉమెన్ లిఫ్ట్ అనే కార్యక్రమంలో మాట్లాడాను. ఎక్కువ మంది మహిళలు రీసెర్చ్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ రంగంలో ఉండటం అవసరం. అట్టడుగు స్థాయిలో కూడా మహిళలకు ఇన్‌ఫార్మల్‌ సెక్టార్లో ఉద్యోగాలు ఉన్నాయి. సమాజానికి ఏం కావాలో వాళ్లకి తెలుసు. వాళ్లు వ్యాపారాలు ప్రారంభించి, ఫోన్‌ల ద్వారానే పనులు పూర్తి చేయగలరు.

* ఆనంద్ - మహమ్మారి పరిస్థితులు అందరికీ కష్టమే, కానీ మహిళలకు దుర్భరమైనవని ఎందుకన్నారు?

మిలిందా- లేబర్‌ ఫోర్స్‌ నుంచి మహిళలను బయటకు పంపేశారు. వ్యాపారాలు ఆగిపోయాయి. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ప్రతి సమాజంలో మహిళలు తమ పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని భావిస్తున్నారు. ఇది దుర్భరమైనది. పురుషులు, మహిళలు ఉద్యోగాలకు తిరిగి వెళ్లడం చూశాం. కానీ స్త్రీలు ముందున్న స్థాయిలో తిరిగి ఉద్యోగాలకు వెళ్లడం లేదు. ఎందుకంటే శిశు సంరక్షణ రంగంలో సంక్షోభం ఉంది.

* ఆనంద్- మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు, మహిళలు టీకాలు వేయించుకోవాలని ప్రచారం నిర్వహించారు? కొన్ని కథనాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ప్రపంచం ఆ స్టోరీలను తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా?

మిలిందా- దాని నుంచి నేర్చుకోవలసిన చాలా దేశాలు ఉన్నాయి. ఆశా వర్కర్లు ఫ్రంట్‌లైన్ సైనికులుగా వ్యవహరించారు. టీకాలు అందుబాటులోకి రాకముందే.. వారు చేతులు కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం, మాస్క్‌లు క్రియేట్ చేయడం, పంపిణీ చేయడం గురించి వివరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు, వారు ముందు వరుసలో ఉండి ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేలా అవగాహన కల్పించారు. ప్రతి హెల్త్ సిస్టమ్‌ ఆశా వర్కర్స్‌ వంటి సిస్టమ్‌ కావాలని కోరుకుంటాయి.

* ఆనంద్ - భారతదేశం సాంకేతికంగా ఈ వ్యవస్థలకు సపోర్ట్‌ చేస్తుందని నమ్ముతున్నారా? మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలం? ఇతర దేశాలకు ఎలా సహాయం చేయగలం?

మిలిందా- G20 ద్వారా ఆఫ్రికాకు సహాయం చేయడానికి సౌత్‌-సౌత్‌ కొలాబరేషన్‌ చేయవచ్చు. డిజిటలైజేషన్‌, ఇతర ఫైనాన్షియల్‌ మార్పులపై అవగాహన కల్పించవచ్చు. ఆయా దేశాల్లో ఇలాంటి మార్పులను తీసుకొచ్చేందుకు ప్రోత్సహించవచ్చు. డిజిటల్ అప్లికేషన్‌లను రూపొందించడానికి భారతదేశంలో అవకాశాలన్నీ ఉన్నాయి. ఆఫ్రికా కోసం అప్లికేషన్ ఉంటుంది, అక్కడ వారు తమ సొంత పరిష్కారాలను కనుగొంటారు. తక్కువ ఇన్‌కం నుంచి మిడిల్‌ ఇన్‌కం లెవల్‌కు చేరిన దేశాల నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాలని నాకు తెలుసు. అందుకు సహకారం అవసరం.

* ఆనంద్- ప్రపంచ జనాభాలో 25% ఇండియాలో ఉంది. అందులో 50% స్త్రీలు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఇది ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం చూపింది? మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి?

మిలిందా- ప్రసవ సమయంలో కొందరు మహిళలు చనిపోతుండటంపై ఇండియా దృష్టి పెట్టింది. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు బతుకుతున్నారు. ఆడపిల్లలకు సరైన పోషకాహారం లభిస్తోంది. భారతదేశం మధ్యతరగతి కోసం మాత్రమే కాకుండా పేద వర్గాలకు కూడా ఫలాలు అందేలా చేస్తోంది. అవి అపురూపమైన ప్రయత్నాలు.

సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది మరొక వినూత్న ఆలోచన. దీనిలో 86 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. వారు ప్రాథమిక స్థాయి నుంచి నాయకత్వం వరకు మారారు. ఈ మోడల్‌ను ఇతర దేశాల్లో కూడా అనుసరించడం చూస్తారు.

Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు... రూ.7,000 లోపే 5 రోజుల టూర్

* ఆనంద్ - మీరు గతంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికి భారతదేశంలో టెక్నాలజీ, హెల్త్‌ రంగాల్లో ఎక్కువ మంది మహిళలను చూస్తున్నారా?

మిలిందా- అనిపిస్తోంది. కానీ సైన్స్‌లో ఎక్కువ మంది మహిళలను చేరుస్తున్నారని నేను అనుకుంటున్నాను.

* ఆనంద్- డైవెర్సిటీకి సంబంధించిన విధానం ఎలా ఉంది? మీరు డైవెర్సిటీని సమర్ధించారు. భారతీయ కార్పొరేట్లు ఇప్పుడు దాని వైపు చూస్తున్నారని మీరు నమ్ముతున్నారా? లీడర్‌షిప్‌లో టాప్‌ పొజిషన్‌లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందా?

మిలిందా- టెక్ రంగంలో అది నిజం. చాలా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు కాబట్టి అది సాధ్యమవుతోంది. అన్ని పరిశ్రమలు ముందుకు రావడం ముఖ్యం. మేము ప్రతి పరిశ్రమలో 3 డజన్ల మంది పురుషులను చూస్తాం. యువకులు వారిని ఆదర్శంగా తీసుకుని అలా తయారు కావాలని కోరుకుంటారు. యువతులకు కూడా అలాంటి సందర్భం రావాలి. ప్రతి రంగంలో 3 డజన్ల మంది మహిళలు కనిపించాలి.

ఆనంద్- స్త్రీలు ఎదగడానికి అవకాశం ఇవ్వడం లేదా? సామర్థ్యం ఉన్న మహిళలకు ఎక్కువగా రావడం లేదా? ఈ రెండు అంశాల్లో ఏది స్పష్టంగా కనిపిస్తుంది?

మిలిందా- గతంలో మహిళలను అనుమతించలేదు. మెడిసిన్ తీసుకోండి.. భారతీయ ఇన్‌స్టిట్యూట్‌లు ఎక్కువ సంఖ్యలో మహిళా డాక్టర్‌లను గ్రాడ్యుయేట్ చేస్తున్నాయని నేను భావిస్తున్నాను. అయితే మీరు టాప్ సర్జన్ల స్థానాన్ని పరిశీలిస్తే పురుషులు ఉన్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులను చూడండి, వారు మహిళలు. కానీ ఆసుపత్రులను నడుపుతున్న టన్నుల మంది మహిళలు కనిపించరు. ఈ అడ్డంకులను క్లియర్‌ చేయాలి.

* ఆనంద్- స్త్రీలు దీన్ని ఎలా నిర్వచిస్తారు? పురుషుల కంటే స్త్రీల నుంచి ఎక్కువ ఆశిస్తున్నారు. వారు పిల్లలను కంటారు, పోషిస్తారు, పురుషుడితో పోల్చితే స్త్రీ బాధ్యతలు ఎక్కువ. మహిళలు అన్ని రంగాల్లోకి రావాలని మీరు చెప్పినప్పుడు, ఎవరైనా దానిని ఎలా చూడాలి? సమాజం పెద్ద సవాలా?

మిలిందా- సమాజం స్త్రీలపై ఆ బాధ్యతలు పెట్టిందని నేను భావిస్తున్నాను. పిల్లలను పోషించడం, కన్నీళ్లతో లంచ్ బాక్స్‌లను నింపడానికి మహిళలను పరిమితం చేశారు.

నార్డిక్ దేశాల్లో మహిళలకు 30 సంవత్సరాలకు పైగా చాలా పెయిడ్‌ మెడికల్‌ లీవ్స్‌ ఉన్నాయి. పిల్లల విషయంలో స్త్రీ, పురుషులు బాధ్యత తీసుకుంటారు. స్త్రీలు రెండు పనులు చేయగలిగేలా సోషల్‌ రూల్స్‌ను మార్చాలి.

* ఆనంద్- పిల్లల ఫౌండేషన్ కో చైర్‌గా మీ లక్ష్యాలు ఏంటి?

మిలిందా- నేను సమాజంలో మహిళలను అన్ని రంగాల్లో చూడాలని అనుకుంటున్నా. అది పెద్ద లక్ష్యం. పిల్లలకు టీకాలు వేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇందుకు భారత్‌ ఆదర్శం. కోవిడ్ సమయంలో కూడా, 2.0 కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇక్కడ తయారు అయ్యాయి. చాలా మంది ప్రాణాలను నిలిపింది. ఇలా ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నాను.

* ఆనంద్- జీవితం మనపై చాలా సవాళ్లను విసురుతున్నప్పుడు, మీరు ఆశావాదంగా ఎలా ఉంటారు?

మిలిందా- కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే లేదా పిల్లలను పాఠశాలల్లోకి చేర్చే ప్రయత్నాల్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడండి. భవిష్యత్తులో మంచి జరగాలనే ఆలోచనల్లోనే ఉంటారు. దీన్నే ప్రతి సందర్భానికి అన్వయించుకోవాలి.

First published:

Tags: Business, Melinda gates, Technology

ఉత్తమ కథలు