హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియామకం

జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియామకం

మనోజ్ సిన్హా

మనోజ్ సిన్హా

జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేర‌కు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులిచ్చారు.

    జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేర‌కు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులిచ్చారు. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గత ఏడాది కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్న జీసీ ముర్మూ రాజీనామా చేశారు. జీసీ ముర్ము త్వరలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాగ్ చీఫ్ రాజీవ్ మెహరిషీ  వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జీసీ ముర్ము కాగ్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నట్టు సమాచారం. 2019లో జమ్మూకాశ్మీర్‌ పునర్విభజన చట్టం తీసుకొచ్చిన తర్వాత అది కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దానికి జీసీ ముర్ము తొలి గవర్నర్ గా నియమితులయ్యారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Jammu and Kashmir

    ఉత్తమ కథలు