Mann Ki Baat: టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ టీమ్ వీరోచిత పోరాటాన్ని మెచ్చుకుంటూ... 80వ ఎపిసోడ్ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆల్ ఇండియా రేడియోలో ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రతీ మెడల్ ప్రత్యేకమే అన్న మోదీ... హాకీలో ఇండియా మెడల్ గెలిస్తే... దేశమంతా సంతోషిస్తారని అన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ ఎంతో సంతోషిస్తారన్న ఆయన... భారత యువత ఏదో ఒకటి కొత్తగా, భారీగా చేసి... చరిత్ర సృష్టించాలన్నారు. రోదసీ రంగంలో వస్తున్న సంస్కరణలు యువత ఆశల్ని ప్రతిబింబిస్తున్నాయన్న మోదీ... అదే విధంగా... క్రీడారంగంలో పిల్లలు విజయాలు సాధిస్తే వారి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారని అన్నారు. పారా ఒలింపిక్స్లో కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని ప్రస్తుతించిన మోదీ... ఇండియాలో క్రీడలపై పెద్ద ఉద్యమం మొదలైందన్నారు. మన మైదానాలు ప్లేయర్లతో నిండిపోవాలి అన్నారు.
భారత సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్న మోదీ... పరిశుభ్రమైన నగరంగా పేరు పొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్... ఇప్పుడు దేశంలోనే మొదటి మిగులు జలాల నగరం (‘Water Plus’ city)గా గుర్తింపు పొందిందని చెప్పారు.
Tune in to this month’s #MannKiBaat. https://t.co/HJ0nJIXJFd
— Narendra Modi (@narendramodi) August 29, 2021
దేశవ్యాప్తంగా 62 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారన్న ప్రధాని మోదీ... కరోనా నియమ నిబంధనలను మనమంతా నిబద్ధతతో పాటించాలన్నారు. దేశంలో కరోనా సమస్యలు ఉన్నప్పటికీ స్వచ్ఛ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
దేశంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా స్టార్టప్ కల్చర్ రావడం గొప్ప విషయమన్న ప్రధాని మోదీ... బొమ్మల తయారీలో యువత దృష్టి సారించాలి ఉన్నారు. ఇది ఆరేడు లక్షల కోట్ల మార్కెట్ అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇందులో భారత వాటా చాలా తక్కువ ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Telugu: మీ పిల్లలకు తెలుగు నేర్పాలా?.. ఈ యాప్స్ ట్రై చెయ్యండి!
ప్రతి నెలలో చివరి ఆదివారం మనసులో మాట (Mann Ki Baat) పేరుతో దేశ ప్రజలకు రేడియో ప్రసంగం ద్వారా తన మనసులో మాటను వివరిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా ఆగస్టులో 80వ ఎపిసోడ్లో ఆయన ఉదయం 11 గంటలకు ఆల్ఇండియా రేడియోలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ కూడా ప్రసారం చేస్తోంది. ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ (www.newsonair.com)లో కూడా ఇది ఉంటుంది. అంతేకాదు... న్యూస్ ఆన్ ఎయిర్ (newsonair Mobile App) మొబైల్ యాప్లో కూడా లభిస్తోంది. అలాగే AIR, DD న్యూస్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ఇది ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.