హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mann Ki Baat: అత్యంత ఆసక్తికరంగా ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్. ఏం చెప్పారంటే...

Mann Ki Baat: అత్యంత ఆసక్తికరంగా ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్. ఏం చెప్పారంటే...

అత్యంత ఆసక్తికరంగా ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ (image credit - twitter)

అత్యంత ఆసక్తికరంగా ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ (image credit - twitter)

Mann Ki Baat 79th Episode: ప్రతి నెలలో కంటే... ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ఉత్సాహంతో మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. అందుకు బలమైన కారణాలున్నాయి. ఏమన్నారో తెలుసుకుందాం.

Mann Ki Baat: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా పతకం గెలిచిన సమయం... కరోనా కేసులు తగ్గుతున్న సందర్భం... వ్యాక్సినేషన్ సాగుతున్న టైమ్... ఇలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తున్న సమయంలో... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఆల్ ఇండియా రేడియో (AIR)లో 79వ మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12 గంటలకు ముగిసింది. దీన్ని AIRతోపాటూ... దూరదర్శన్, రేడియో మొబైల్ యాప్‌లో కూడా ప్రసారం చేశారు. ఒలింపిక్ ప్లేయర్లు ఎన్నో కష్టాలు భరించి... ఆ స్థాయి (Tokyo Olympics)కి వెళ్లారన్న ప్రధాని మోదీ... వారిని సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని కోరారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ (‘Victory Punch Campaign’) ప్రారంభించినట్లు తెలిపారు.

జులై 26న కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన మోదీ... మన భారత సైనికుల నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలను ప్రపంచ దేశాలు చూశాయన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు రేపు శ్రద్ధాంజలి ఘటించమని, సలాం చెయ్యమని దేశ ప్రజలను కోరారు. అలాగే... కార్గిల్ విజయ గాథను చదవాలని విద్యార్థులను కోరారు.

మన్ కీ బాత్‌లో చెప్పే అంశాల్లో 75 శాతం అంశాలు 35 ఏళ్ల లోపు యువత నుంచే వస్తున్నాయనీ... ఇది ఎంతో మంచి పరిణామం అని అన్నారు. అలాగే... దేశవ్యాప్తంగా ప్రజలు జీవనాధారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. శివార్లలో ఉండే గ్రామాల్లో సైతం సరికొత్త ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్‌లో యాపిల్ పంటల సాగు, ఉత్తరప్రదేశ్‌లో అరటిపండ్లతో ఫైబర్ ఉత్పత్తిని మోదీ ప్రస్తావించారు. అలాగే బెర్ (Ber) పండ్ల సాగు చేపట్టాలనీ, దాని ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఆ ఊరంతా బొమ్మలే... సజీవ శిల్పాలు!... కళ్లతో చూసినా నమ్మలేం

ఆగస్ట్ 15కి ముందుగా వచ్చిన మన్‌కీ బాత్ ఇది కావడంతో... ఈ సందర్భంగా మోదీ... యువతకు సరికొత్త పిలుపు ఇచ్చారు. దేశం ముందు... ఎల్లప్పుడూ ముందే (‘Nation First and Always First’) అనే ఉద్దేశంతో ముందుకు సాగాలన్నారు.

First published:

Tags: Mann Ki Baat, PM Narendra Modi, Tokyo Olympics

ఉత్తమ కథలు