Mann Ki Baat : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతీ నెలా చివరి ఆదివారం.. మన్‌కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడిన మోదీ.. తెలంగాణ ప్రస్తావన తేవడం విశేషం. సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న తనకు జీ-20 లోగోను పంపారన్న మోదీ.. ఆ అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఇలాంటి క్రియేటివిటీ.. దేశ ప్రజల్లో ఉత్సాహం, ఎనర్జీని చాటి చెబుతోందని అన్నారు. ఈ రోజున దేశంలోని ప్రజలంతా కొత్తగా, ప్రత్యేకంగా ఏదైనా చెయ్యడానికి ఎవరి వంతుగా వారు తమ తమ రంగాల్లో ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఈసారి డిసెంబర్ 1న భారత్ బాధ్యతగా తీసుకోబోయే జీ-20 సదస్సును చక్కగా జరిపేందుకు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మెచ్చుకున్న మోదీ.. ఇది మనకు గర్వకారణం అన్నారు. ఈ సదస్సులోని సభ్య దేశాల్లో ప్రపంచంలోని మూడొంతుల జనాభా ఉన్నారన్న మోదీ... ప్రపంచంలోని నాలుగింట మూడొంతుల వాణిజ్యం ఈ దేశాల్లోనే జరుగుతోంది అన్నారు. ప్రపంచ జీడీపీలో 80 శాతం ఈ దేశాలదేనని తెలిపారు.
Began today’s #MannKiBaat programme by talking about a very special gift I received from a weaver in Telangana and how it is an example of keen interest towards India’s G20 Presidency. pic.twitter.com/NSKgGroS9s
— Narendra Modi (@narendramodi) November 27, 2022
జీ-20 సదస్సును నిర్వహించబోతుండటం గర్వంగా ఉందని దేశవ్యాప్తంగా ప్రజలు తనకు లేఖలు పంపుతున్నారన్న మోదీ.. ఇది భారత్‌కి పెద్ద బాధ్యత అన్నారు. వాతావరణం, పర్యావరణం, కాలుష్యం ఇలా ఎన్నో ప్రపంచ సమస్యలకు భారత్ సమాధానం ఇస్తోందన్న మోదీ.. ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్తు థీమ్‌ని ఇచ్చినట్లు తెలిపారు.
Pics : ఇప్పటికే 9 మందిని పెళ్లి చేసుకున్నాడు.. మరో నలుగురు కావాలట..
నవంబర్ 18న ప్రైవేట్ రాకెట్‌ని విజయవంతంగా నింగిలోకి పంపడం ద్వారా.. అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృషించిందని గుర్తు చేసిన మోదీ.. సరికొత్త శకం.. పూర్తి విశ్వాసంతో మొదలైందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mann Ki Baat, Narendra modi