హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mann Ki Baat: ఆ ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన

Mann Ki Baat: ఆ ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Mann ki Baat: సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి సందర్భంగా.. ఛండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీవెల్లడించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్ (Mann Ki Baat)' రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక ప్రకటన చేశారు. చండీగఢ్ విమానాశ్రయానికి (Chandigarh Airport) భగత్ సింగ్ (Bhagat Singh) పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు వెల్లడించారు. నేడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప మానవతావాది, ఆలోచనాపరుడని ప్రశంసించారు. ప్రపంచంలోని ఎన్నో ఎత్తుపల్లాలను ఆయన కళ్లారా చూశారని చెప్పారు. సిద్ధాంతాల ఘర్షణలకు ఆయన సాక్షిగా నిలిచారని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ.

  నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలపై మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. చిరుతల గురించి మాట్లాడాలని తనకు చాలా సందేశాలు వచ్చాయని ప్రధాని మోదీ అన్నారు. చీతాలను భారత్‌కు తిరిగి రావడం పట్ల దేశం నలుమూలలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. ఇది భారతదేశపు ప్రకృతి ప్రేమకు నిదర్శమని చెప్పారు. చితాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని.. ఇందుకోసం ఓ కాంటెస్ట్ పెడుతున్నామని, గెలిచిన వారికి అందరి కంటే ముందుగా చితాలను చూసే అవకాశం వస్తుందని చెప్పారు. చీతాలపై భారత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచార కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి? అలాగే నమీబియా నుంచి వచ్చిన చీతాలకు ఎలాంటి పేర్లు పెట్టాలో.. MyGov ద్వారా సూచించాలని కోరారు.

  సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి సందర్భంగా.. ఛండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీవెల్లడించారు. అమరవీరుల స్మారక చిహ్నాలు, వారి పేరు మీద ఉన్న స్థలాలు, సంస్థల పేర్లు మనకు స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఇటీవల ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహ ఏర్పాటు కూడా ఇలాంటి ప్రయత్నమేనని స్పష్టం చేశారు.

  అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఖాదీ, చేనేత, హస్తకళ ఉత్పత్తులతో పాటు స్థానిక ఉత్పతులను కొనాగాలని సూచించారు.

  మన్ కీ బాత్‌లో 'యూత్ ఫర్ పరివర్తన్‌ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. బెంగుళూరులో యూత్ ఫర్ పరివర్తన్ పేరుతో ఓ టీమ్ ఉందని... గత 8 సంవత్సరాలుగా ఈ బృందం పరిశుభ్రత, ఇతర సామాజిక కార్యకలాపాల కోసం పని చేస్తోంది. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 370కి పైగా ప్రదేశాలను సుందరీకరించిందని చెప్పారు. చెత్తను తొలగించడమే కాకుండా గోడలపై పెయింటింగ్స్‌ కూడా వేస్తారని ప్రశంసించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bhagat Singh, Chandigarh, Mann Ki Baat, Narendra modi

  ఉత్తమ కథలు